AP News: ఏపీలో జనసేన బలపడుతుందా?? బలహీనపాడుతుందా??



ఏపీలో జనసేన బలపడుతుందా??


బలహీనపాడుతుందా??


స్పీడు పెంచకపోతే మళ్ళీ కష్టం అబ్బ



ఏపీలో జనసేన బలపడుతుందా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. గత ఎన్నికలతో పోలిస్తే కాస్త బెటర్ గాని..పార్టీ పూర్తి స్థాయిలో బలపడలేదు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు పడ్డాయి.


ఇప్పుడు గట్టి గా చూసుకుంటే 10 శాతం ఓటు బ్యాంకు వరకు పెరిగి ఉంటుంది. దీని వల్ల జనసేనకు ఒరిగేది ఏమి లేదు. దీంతో జనసేన అధికారంలోకి రాలేదు. పవన్ సీఎం కాలేరు. అయితే జనసేన అనుకున్న మేర బలపడటం లేదు. ఇప్పుడు పెరిగిన బలం కూడా వైసీపీపై వ్యతిరేకత రావడం వల్లే. వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు కొందరు టిడిపి వైపు చూడలేక..జనసేన వైపుకు వస్తున్నారు.


దీంతో కాస్తో కూస్తో జనసేన బలం పెరిగింది. కానీ జనసేనకు కావాల్సింది ఇది కాదు..సింగిల్ గా అధికారంలోకి వచ్చే బలం నిజానికి గత ఎన్నికల తర్వాత జనసేనకు మంచి అవకాశం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు టిడిపి పాలన ఏంటో చూశారు..ఇప్పుడు వైసీపీ పాలన చూస్తున్నారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్న వాళ్లని జనసేన వైపు ఆకర్షించాలి. కానీ ఆ పని పవన్ చేయలేకపోయారు. ఏదో అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై పొరాడి కొద్ది మేర బలం పెంచారు.


అంతే ఇంకా అంతకంటే బలం పెంచలేకపోయారు. పైగా టిడిపి బలం పెరుగుతూ వచ్చింది. అంటే పవన్ విఫలమైనట్లే. అదే సమయంలో రాష్ట్రంలో అన్నీ స్థానాల్లో జనసేనకు బలమైన నాయకత్వం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు కింది స్థాయి నుంచి నేతలని బలోపేతం చేసుకోవడం రావడం కష్టం. అంటే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని లాగాలి. అందులోనూ పవన్ విఫలమవుతున్నారు.


ఇటీవల మహాసేన రాజేష్ లాంటి దళిత నాయకుడు జనసేన వైపు చూసిన సరే..ఆయన్ని పార్టీలోకి తీసుకురాలేకపోయారు. దీంతో ఆయన టిడిపిలోకి వెళ్లారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేన లేదా టిడిపి అని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు..ఆయనతో మాట్లాడి జనసేన వైపు తీసుకురాలేదు..ఇప్పుడు ఆయన టిడిపిలోకి వెళుతున్నారు. ఇలా బలమైన నేతలని చేర్చుకోలేకపోతున్నారు. దాని వల్ల జనసేన బలపడటం లేదు. కాబట్టి పవన్..రాజకీయాలపై ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.

Post a Comment

Comments