పుట్టపర్తి: వస్తే తిరిగి వెళ్లలేము అంటున్న విదేశీ అ­తి­థుల ఆనందం

పుట్టపర్తి: 1968వ సంవత్సరం మార్చి 29వ తేదీన, సత్యసాయి సేవ (నిస్వార్థ సేవ) అంటే ఏమిటి మరియు సేవాదళ్ (స్వచ్ఛంద సేవకుడు) ఎవరు అని శ్రీ సత్యసాయి బాబా నిర్వచించారు: “ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఆపదలో ఉన్న వారి పట్ల సానుభూతితో మరియు నైపుణ్యంతో చేసే ప్రతి సేవ సత్యమే. సాయి సేవ. సేవాదళ్ సేవ చేయడానికి ఆసక్తిని కలిగి ఉండాలి మరియు సేవ చేయడానికి శిక్షణ పొందాలి, ఎందుకంటే నా పేరు తీసుకునే వారి నుండి సేవ తెలివైన మరియు నిజాయితీగా ఉండాలి.

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతుల కలబోతగా ప్రతిబింబిస్తోంది. విదేశీ అతిథులు తమ సంప్రదాయాలను వదిలి.. తెలుగు డ్రెస్‌ కోడ్‌ను ఇష్టపడుతుంటారు. మన వంటకాలపై ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ జీవనశైలిని పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనలో సంప్రదాయాలను అనుసరిస్తారు. సుమారు 150 దేశాల నుంచి యాత్రికులు పుట్టపర్తి వస్తుంటారు.

విదేశీ సంప్రదాయాలను పరిచయం చేయడంతో పాటు మన సంప్రదాయాలను అనుసరిస్తారు. భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇదో గర్వకారణమని పుట్టపర్తివాసులు చెబుతు­న్నారు. సాయిబాబా చలువ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. విదేశీయులు మెచ్చే విధంగా పుట్టపర్తిలో వసతి అందుబాటులో ఉంది.

విదేశీయులు అందరూ భారతీయ జీవనశైలిని చూసి ఆశ్చర్యంతో ఆనందంలో పులకరించి మన సంప్రదాయాలను ఎంతో ఇష్టంతో విదేశీయులు కూడా అనుసరిస్తుంటారు. 

హోటళ్లు, వస్త్ర దుకాణాలు, సంగీత పరికరాల అంగ­ళ్లు ఉ­న్నా­యి. విదేశీయులు మెచ్చే విధంగా హో­టళ్లలో అ­లంకరణ కనిపిస్తుంది. సుమారు 10 లా­డ్జిలు, 30 హో­­టళ్లు విదేశీయులకు నచ్చేశైలిలో అం­దు­బాటులో ఉ­­న్నాయి. భారత దేశానికి వచ్చి­నా.. ఇ­క్కడి ద­ర్శ­నీయ స్థలాలను చూసినా వదిలి వెళ్లలే­మని విదేశీ అ­తి­థులు అంటున్నారు. ఇక్కడ పాటించే ఆచార వ్య­వ­హారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబు­తు­న్నారు.

Post a Comment

Comments