టాలీవుడ్ లో చాలా మంది లేడీ కామిడీయన్స్ ఉన్న విషయం తెలిసిందే, తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కటుపుబ్బా నవ్వించారు. ఆ లిస్ట్ లో గీత సింగ్ ఒకరు. 2007 లో వచ్చిన కితకితలు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు గీత. ఆమె పలు కామెడీ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 32 సినీమాలలో నటించి మెప్పించారు గీత సింగ్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గీత ఆసక్తికర విషయం తెలిపారు.
ఆమెను ఒక సినిమా షూటింగ్ లో ముంబై హీరోయిన్స్ అవమానించారని తెలిపింది గీత సింగ్ మాట్లాడుతూ ... అల్లరి నరేష్ నటించిన ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను కారవాన్ లోకి ఎక్కాను. దాంతో అందులో అప్పటికే ఉన్న ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ గీత సింగ్ ని చూసి తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు అనుకుని తనను చాలా అవమానించారని చెప్పుకొచ్చింది.
గీత సింగ్ ఒకప్పటి హీరోయిన్ అనే విషయం వాళ్ళకి తెలియక ఆలా అవమానించారు అని ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల గీత సింగ్ ఎటువంటి మూవీస్ కానీ షోస్ లో కానీ పెద్దగా కనిపించటం మానేశారు.
తాజాగా ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్ లో గీతాసింగ్ మల్లి కనిపించటం మొదలుపెట్టారు.
గీత సింగ్ ఇంట ఇప్పుడు విషాదాం చోటు చేసుకుంది. గీతాసింగ్ పెళ్లి చేసుకోలేదన్న సంగతి అందరికి తెలిసిందే, కానీ తన అన్నయ్య గారి కొడుకు బాధ్యతని మరియు కసిన్ కూతురు బాధ్యతలని చూసుకుంటున్నారు. వాళ్ళని చదివిస్తూ తమ సొంత పిల్లలిలాగా చూసుకుంటున్నారు.
అయితే ఈ రోజు ఆమె పెంచుకుంటున్న అన్నయ్య కొడుకు ఆక్సిడెంట్ లో మరణించారు. ఈ విషయాన్నీ తమ సన్నిహితులు తెలుగు సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటువచ్చారు. ఈ విషయం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో షాక్ ఇచ్చింది. ఈ విషయం తెల్సుకున్న నెటిజన్లు ఆవిడకి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Comments