జీవితంలో కష్టసుఖాలు వచ్చీపోయే అతిథులు



కష్టసుఖాలు వచ్చీపోయే అతిథులు. అయినప్పటికీ కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం మానవ సహజం. ఆ స్థితిలో అంతా శూన్యంగా తోచడం కూడా జరుగుతుంది. దానితో వెంటనే ఈ జీవితాన్ని చాలించాలనిపిస్తుంది.


"చనిపోతే బాగుండును" అని ప్రతి వ్యక్తీ ఏదో ఒక సందర్భంలో అనుకుంటాడు. ’ఒక’ మాత్రమే కాదు ’అనేక’ సందర్భాలలో అలా అనిపిస్తుంది. తనంత తాను మరణించాలని ప్రయత్నించడమే ఆత్మహత్యా యత్నం.


తన ఉనికియే లేకపోతే - ఇంక ఏ బాధా ఉండదు కదా...అనే భావన చేత ఏర్పడే మనః స్థితి అది.


కానీ ఆ సమయంలో మన ప్రాచీన సంస్కృతి చెప్పిన కొన్ని అంశాలను స్ఫురణకు తెచ్చుకుంటే ఆ మానసిక వైకల్యం నుండి బయటపడగలం.


*"మనిషి మూడు ఉద్రేకాల వల్ల తన ఇంగితాన్ని కోల్పోతారు:"*


 *౧. శోకోద్రేకం* 

 *౨. క్రోధోద్రేకం* 

 *౩. మోహోద్రేకం* 


ఉద్రేకం వల్ల విచక్షణ పనిచేయదు. ఆ సమయంలో విచక్షణని మేల్కొలిపే వివేకం శాస్త్ర గ్రంథాల సాయంతో లభిస్తుంది.


శ్రీ మద్రామాయణంలో జీవితపు విలువను చాలా రమ్యంగా ప్రతిష్ఠించాడు వాల్మీకి.


*’బ్రతకాలి - ఎలాగైనా బ్రతకాలి. బ్రతికుంటేనే భద్రాలను పొందగలం’.*


హనుమంతుడు సీతాన్వేషణార్థం లంకకు చేరుకున్నాడు. నగర వీధులనీ, గృహాలనీ, అంతఃపురాన్నీ, వనాలనీ, విహారస్థలాలనీ....దేనినీ విడిచిపెట్టకుండా గాలించాడు. అయినా సీతజాడ కానరాలేదు.

’ఎలాగైనా సీతను దర్శిస్తాను’ అని ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా బయలుదేరిన ఆంజనేయ స్వామికి - తన ఆశ అడియాసగా మారే సూచనలు కనిపించాయి. ఇంక వెతకవలసినది మిగలలేదు. ఇంకేమిటి కర్తవ్యం!


"తిరిగి వెళ్ళి ’సీత కనబడలేదు’ అని చెప్తే ఎన్నో ప్రమాదాలు ఎదురు కావచ్చు. సీత జాడ తెలియనందున శ్రీరాముడు జీవించలేడు. ఆయన లేనప్పుడు లక్ష్మణాదులు ఉండలేరు. తన మాటను సాధించలేనందుకు సుగ్రీవుడు సైతం జీవితాన్ని త్యజిస్తాడు. ఇలా ఉభయులను దెబ్బతీసిన వాడను అవుతాను. అందుకే తిరిగి కిష్కింధకు వెళ్ళడం మంచిదికాదు. ఈ లంకలోనే జీవితాన్ని చాలించాలి. ఇక్కడే తమంత తాముగా లభించిన ఫలజలాలను స్వీకరిస్తూ కాలం గడపాలి. లేదా - చితిని ఏర్పరచుకొని దూకాలి. లేదా - సముద్రంలో పడిపోవాలి.

అదీ కుదరనప్పుడు - నియమబద్ధుడనై తాపసినై ఇక్కడే ఉండాలి...." అని నిర్ణయించుకుంటాడు. 


*వినాశేబహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి!*

*తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః!!*


’నశించిపోవడంలో అన్నీ దోషాలే. జీవించితేనే శుభాలను చూడగలం. అందుకే ప్రాణాలను ధరిస్తాను. బ్రతికుంటే ఎప్పటికైనా సీతమ్మ కలవవచ్చు.

ఇంకా వెతుకుతాను. ఆ అన్వేషణ కర్మను మానను. నా ప్రయత్నం నేను ఆచరిస్తాను’ అని నిశ్చయించుకున్నాడు హనుమ.


ఇందులో  *’వినాశే బహవో దోషాః...’* శ్లోకం నిత్యం స్మరణలో ఉంచుకోవలసినది. ముఖ్యంగా - బేల మనస్సుతో ఆత్మహత్యా ప్రయత్నాలకు ఒడిగడుగున్న విద్యార్థులు సమస్యను ఎదుర్కొనలేని స్త్రీపురుషులు తమ నివాసపు గోడల మీదనో, టేబుల్ పైనో ఈ శ్లోకాన్ని భావంతో సహా వ్రాసి పెట్టుకోవాలి. బలహీనత ఏర్పడినప్పుడు, ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకోవాలి.


 *దీని తాత్పర్యం:* 


ఒక కష్టం మనం కోరితే రాలేదు. అలాగే మనం కోరకుండానే సుఖమూ రావచ్చు. ఇవాళ జీవితాన్ని భరించలేనంత కష్టం వచ్చినట్లే, ’ఇంకా జీవించాలి’ అనే ఆశను పెంచే సుఖమూ భవిష్యత్తులో రావచ్చు. ఇప్టి మేరకే మన దృష్టిని నిలిపి జీవితాన్ని నశింపజేసుకుంటే, రేపటి సుఖానికి మనం మిగలం కదా!


హనుమంతుడు అప్పుడే హతాశుడై నిస్పృహతో జీవితాన్ని పూర్తి చేసుకొని వుంటే - సీతాదర్శనం, రావణవధ, లోకకళ్యాణం జరిగి ఉండేవా? అందుచేతనే-

*’ఆపదలందు ఓర్మియును - (ఓరిమి - సహనం) అంచిత సంపదలందు ధైర్యము’* - చాలా అవసరమని సుభాషితకారుని బోధ.


జీవితంలో ఒక ద్వారం మూసుకున్నా, మరెన్నో ద్వారాలున్నాయి. అన్నింటికంటే విలువైనది జీవితం. దానిని ఎప్పుడూ చేజార్చుకోకూడదు.

ఇదే రామాయణం - 


సుందరకాండలో మరొక చక్కని సన్నివేశం తారసపడుతుంది....


హనుమంతుడు అశోకవృక్షంపై కూర్చొని గమనిస్తున్నాడు.

రావణుని ప్రేలాపన, సీతమ్మ సమాధానం! అంత దైన్య స్థితిలోనూ ధైర్యంగానే సమాధానమిచ్చింది సీత. ’వృత్తశాండీర్య గర్వితా’ అంటారు వాల్మీకి. ప్రవర్తన, శీలం వలన ఏర్పడిన ఆత్మ విశ్వాసం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ధర్మం ఉన్నచోట - ఎంత దైన్య పరిస్థితులున్నా, అంతర్గతంగా గొప్ప ధైర్యం ఉంటుంది.

*జీవితంలో  కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*.


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


           

                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*,


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు......* 

 


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*


          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,


         *నొప్పి విలువ తెలిసిన వాడు*


          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*


    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

           

                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*


            *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*- 

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*:- 

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*:- 

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* :- 

                   *కానీ ఆత్మీయత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు* :- 

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*


                    *కానీ జీర్ణశక్తిని కాదు*

      


*ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*


*అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*

*కావాలి,*


*స్నానాలతోనే పాపాలు పోతే ముందు*


*చేపలే పాప విముక్తులు కావాలి,*


*తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*


*పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*


*గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*


*ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*


*నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*


*పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,


*నీలో లేనిది బయటేమీ లేదు* 


*బయటఉన్నదంతా నీలోనూ ఉంది....*

Post a Comment

Comments