నందమూరి తారకరత్న మరణం. నారాయణ హృదయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస వదలిన తారకరత్న..
వయస్సు 40 సంవత్సరాలు. వీరికి భార్య, కుమార్తె వున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు మోహనకృష్ణ కుమారుడు తారక రత్న.
1983 లో జన్మించిన తారక రత్న. లోకేష్ పాదయాత్ర లో గుండెపోటు తో కుప్పకూలిన తారక రత్న.
23 రోజులుగా చికిత్స పొందుతున్న వీరు నేడు మరణించారు.
శోకసముద్రంలో నందమూరి, నారా వారి కుటుంబాలు.*
*తిరిగిరాని లోకాలకు తారకరత్న.. శివరాత్రి రోజే శివైక్యం*
బెంగళూరు : నందమూరి తారకరత్న కన్నుమూశారు.
*అత్యంత రహస్యంగా తారకరత్న పార్థివదేహం బ్యాక్ గేట్ ద్వారా తరలింపు* ❗️
*కర్ణాటక పోలీసులు బందోబస్తు మధ్య బెంగళూర్ నుండీ తారకరత్న పార్థివదేహం హైదరాబాద్ కు తరలింపు*.
▪️ *ఎస్కార్ట్ వాహనాలతో బయల్దేరిన అంబులెన్స్*
▪️ఈ నేపథ్యంలో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కి తరలిస్తున్నారు.
▪️అంబులెన్స్ ద్వారా ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు.
▪️తరకరత్న కన్నుమూశారనే వార్తతో స్థానికంగా ఉన్న అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు.
▪️అభిమాన నటుడిని చివరిసారిచూసేందుకు భారీగా తరలి వచ్చారు.
▪️అభిమానుల తాకిడిని గమనించిన వైద్య బృందం.
▪️తరకరత్న భౌతిక కాయాన్ని ఆసుపత్రి బ్యాక్ గేట్ ద్వారా అంబులెన్స్ లో తరలిస్తున్నారు.
▪️రపు(ఆదివారం)ఉదయం వరకు ఆయన మృతదేహం హైదరాబాద్‌కి చేరే అవకాశం ఉంది.
▪️తరకరత్నని బ్యాక్ గేట్ ద్వారా తరలించడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
▪️తరకరత్నని చూసేందుకు చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నామని, ఆయన్ని చూడాలని తపించామని, కానీ తమకు సమాచారం ఇవ్వకుండా, చూడనివ్వకుండా బ్యాక్ గేట్ ద్వారా తరలించడం పట్ల వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
▪️తమకి బాడీని చూపించాలని, చూపించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు.
పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
ఇక విదేశీ డాక్టర్లతో చికిత్సను అందించారు కుటుంబసభ్యులు.. అయినా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు.
23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఈ రోజు (శనివారం 18న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది.
నందమూరి ఫ్యామిలీకి పలువురు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు.
Comments