*మంగళగిరి జర్నలిస్ట్ లలో కొందరు దొంగలు*
*కట్ట కట్టబడిన లోగోలతో దోపిడీ దొంగలు.*
*కుదిరితే బేరసారాలు లేకుంటే బెదిరింపులు.*
*వీరి ఆగడాలకు నగరంలో అడ్డు అదుపు లేకుండా పోతుంది*
*చోద్యం చూస్తున్న మీడియా సంస్థలు???!!!...*
*మీడియా సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు*
మంగళగిరి మీడియాలో కొందరు దొంగలు చేరారు. ప్రతీ గొట్టంగాడు చేతిలో ఓ చిడత పట్టుకుని ఆ చిడత ను ఆసరాగా చేసుకుని అవినీతి-అక్రమ వ్యవహారా లు చేస్తూ జర్నలిస్ట్ అని హోదాలో మనుగడ సాగిస్తున్నారు.నది జలాలలో నావలో ప్రయాణం చెయ్యాలి అంటే... తెడ్డేసి నావను నడిపించినట్లు,తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్లు ఇప్పుడు మంగళగిరిలో కొందరు చేతిలో ఓ గొట్టం (లోగో) ఉంటే చాలు మంగళగిరిని అడ్డదిడ్డంగా దోచే యొచ్చు అనే విధానంలో కొందరు గొట్టంగాళ్ళు మంగళగిరిలో జర్నలిస్టులు గా చెలామణీ అవు తున్నారు.అసలు జర్నలిజం అంటే దోచు కోవటం, దోపిడీ చేయటం, బెదిరించటం, మాట వినక పోతే ఎదుటి వారికి నష్టం కలిగించటంలా వ్యవ హరిస్తూ....జర్నలిజాన్ని ఓ రక్షణ కవచంలా మార్చు కున్నారు.ఇలా మంగళ గిరిలో కొంతమంది జర్నలిస్టుల తీరు పరిశీలిస్తే రాష్ట్రంలో కొత్త చానల్స్ ఏం వస్తున్నాయి దానికి మంగళగిరి ప్రాంతానికి రిపోర్టరు మా వద్ద అందుబాటులో ఉన్నాడు అంటూ కొత్తగా వస్తున్న, వచ్చిన గుంటూరు ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లతో బేరసారాలు కుదిరించుకొని జర్నలిజం లో ఏ అర్హత లేకపోయినా ప్రతి ఆవారా గాడు జర్నలిజంలోకి వచ్చి సాగిస్తున్న వ్యవహారాలు మామూలుగా అడ్డూ- అదుపూ లేకుండా పోయాయి.పట్టణంలో ఓ ఐదారు లోగోలతో ఒక ముఠా దొంగ జర్నలిస్ట్ లు సిండికేట్ గా ఏర్పడి నగరం లో వ్యాపార సంస్థలను దోచుకోవటం,ప్రభుత్వ కార్యాలయాలు,పలు షాపులలో దౌర్జన్యం చేయటం, పోలీస్ స్టేషన్లలో అనుకూలతను,అవకాశాన్ని బట్టి సెటిల్మెంట్లు చేయటం, పిడిఎస్ రైస్ మాఫియా కు అండగా నిలవడం, అవకాశం ఉన్న ఎక్కడైనా సరే తన ఉనికిని చాటుకోవటం,దోచుకోవటం,అనే కొందరి జర్నలిస్ట్ ల వ్యవహారం అంగళగిరి మీడియా విలువలను కాలరాసింది.అలాగే ఈ దొంగ జర్నలిస్ట్ ల సిండికేట్ బ్యాచ్ కి స్వతహాగా ఏమైనా పనులు కావాల్సి వస్తే పని వాటిని చేయించు కోవడానికి వెళ్లి అక్కడ పెద్ద జర్నలిస్టులమనే హోదా ప్రదర్శించటం,నేనెవరో తెలుసా అని చిడతలు చూయించి బెదిరించటం, చూశావా...మీడియా మీ అంతు తేలుస్తాం... అంటూ బెదిరింపులకు పాల్పడటం అవకాశం కొద్ది డబ్బు పిండుకోవటం వంటి చర్యలకు ఈ దొంగ జర్నలిస్ట్ ల ముఠా పాల్పడుతున్నారు. ప్రధానంగా మంగళగిరి ఎలక్ట్రానిక్ మీడియాలోకి రంగ ప్రవేశం చేయాలంటే ఈ దొంగ జర్నలిస్టుల సిండికేట్ ముఠాతో చర్చలు జరిపి ఎంతో కొంత నగదు సమర్పించుకుంటే ఓ గొట్టం కొత్తగా మీడియాలోకి రావాలనుకునేవారికి కొనుగోలు చేయిస్తారు. ఇక ఆ లోగో ఉన్న గొట్టాన్ని పట్టుకొని పట్టణం మీద పడి బొచ్చు గొరిగే మంగళ షాపుల నుండి స్వీట్ షాపు,నూడిల్స్ బండి నిర్వాహకులతో పాటు, నెయ్యి-గొయ్యి ఎవ్వరిని వదిలేది లేదు.జర్నలిజం అంటే దోచుకోవడమే ప్రధాన వృత్తి అని మంగళగిరి జర్నలిజానికి సరికొత్త భాష్యం చెప్పారు ఈ దొంగ జర్నలిస్ట్ లు. ఒకటి కాదు రెండు కాదు నగరంలో ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థలతోపాటు పలు వ్యాపార సంస్థలు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ వ్యక్తులను బెదిరించి మీడియాను అడ్డం పెట్టి
ఈ సిండికేట్ బ్యాచ్ తమ పబ్బం గడుపుకుంటూ వ్యవహరిస్తున్న తీరు మంగళగిరి మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.మీడియా పేరు చెబితే తిరుగు లేకుండా వాళ్ళ అక్రమ వ్యవహారా లన్నీ కొనసాగించుకోవచ్చ ని జర్నలిస్టులుగా మీడియాలోకి వస్తున్నారు. ఏమాత్రం విలువలు లేకుండా జర్నలిజాన్ని పూర్తిస్థాయిలో బ్రష్టు పట్టించి ఈ రోజున మంగళగిరిలో జర్నలిస్టులు అంటే అసహ్యించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దొంగ జర్నలిస్టుల సిండికేట్ ముఠా బాధి తులు ఎంతోమంది ఉన్నారు కానీ...ధైర్యం చేసి సాహసంతో ముందుకు వచ్చే ఏ బాధితులు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఈ దొంగల ముఠా జర్నలిస్టులపై పోలీసులు పర్యవేక్షణ ఉండాలని కొంతమంది బాధితులు కోరుతున్నారు.అలాగే ఈ ముఠా లో ఉన్నటువంటి దొంగ జర్నలిస్టుల లోగోల ను గుర్తించి ఆయా మీడియా సంస్థలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని కొంతమంది బాధితులు కోరుతున్నారు.ప్రజా సమస్యల పట్ల,సామాజిక బాధ్యత వహించాల్సిన ఛానల్స్ లో కొన్ని *సాక్ష్యానికి నిలువెత్తు కాలేని... ప్రజల స్వాతం త్ర్యాన్ని హరించే,సిగ్గులేని సిక్స్...,రాజూ కాదు- బూజ్ లా..., ఉందో... లేదో తెలియక పోయినా సూపర్ స్టార్ నెంబర్ వన్ లా..., పట్టణ తెలుగు* వంటి పేర్లు కలిగిన ఛానల్స్ పై పోలీసు లు నిఘా ఉంచాలి. పైన సూచించిన ఛానల్స్ పై స్థాయి వ్యక్తులు కూడా తమ వద్ద పనిచేసే జర్నలిస్ట్ లపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ కలిగి ఉంటే మంచిది.ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి ప్రాంతంలో జర్నలిస్ట్ లుగా వచ్చిన కొందరు *చైన్ స్నాచర్స్, అప్పులు చేసి ఐపీ పెట్టిన వారు, నీతులు ఉంది ఎదుట వారికి చెప్పేందుకు అనేవారు, టీచరమ్మలకు సరికొత్త పాఠాలు చెప్పేవారు, అవినీతి ఆకళింపులు, బెదిరిం పుల
భోగాలు,* జర్నలిజం పేరుతో నడమంత్రపు సిరి కొని తెచ్చుకునే దొంగ జర్నలిస్ట్ ల ముందు విలువలు కలిగిన జర్నలిజం శీలం కోల్పోయి సిగ్గుతో తలవంచుకుంది.ఇదీ మంగళగిరిలో జర్నలిజం దుస్థితి.
Comments