పేదల సంక్షేమమే పరమావధిగా జగనన్న సంక్షేమ పథకాలు



సంక్షేమ పథకాలను, అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి


ఇది ధనికులకు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం


పేదలకు అండగా జగనన్న ప్రభుత్వం


గృహసారథులకు, సచివాలయ కన్వీనర్లకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు.


ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 17/2/2023


పేదల సంక్షేమమే పరమావధిగా సమసమాజ స్థాపన కోసం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు సూచించారు. ఇది ధనికులకు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. పేదలకు అండగా జగనన్న సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ఉందన్నారు.


మైలవరంలోని ఎస్వీఎస్ కళ్యాణమండపంలో "మా నమ్మకం నువ్వే జగనన్న" అనే నినాదంతో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ప్రతిమకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.


పార్టీని మరింత బలోపేతం చేస్తున్న జగనన్న


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకు పాలన అందిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. దీనిని పార్టీకి అనుసంధానం చేసుకోవడానికి సచివాలయ స్థాయిలో కన్వీనర్లు, వారి పరిధిలో గృహ సారథులను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా వాలంటీర్ల వ్యవస్థ ఉంటే, వారితో సమాంతరంగా ప్రతి 50 ఇళ్లకు  పార్టీ పరంగా ఈ గృహ సారథులు పనిచేస్తారని వెల్లడించారు. గృహసారథులకు విధి, విధానాలు, బాధ్యతలు తెలిపారు.


దేవినేని ఉమా చెప్పేవన్నీ కట్టుకథలే..!


మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పేవన్నీ కట్టుకథలేనన్నారు. అతను నోరు తెరిస్తే అబద్ధాల పుట్ట అన్నారు. అతని మాయమాటలు విన్న టీడీపీ నాయకులే అతన్ని వైఖరి పట్ల విసుగుచెంది ఉన్నారని విమర్శించారు. ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, తనకు ముడిపెడుతూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటాడన్నారు.


లోకేష్ పాదయాత్రపై విమర్శలు


లోకేష్ పాదయాత్రపై మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట ప్రసాదు గారు విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసిన వారంతా ముఖ్యమంత్రులైతే లోకంలో కార్లు, బస్సులు వుండవని అందరూ పాదయాత్ర చేస్తారని ఎద్దేవా చేశారు. లోకేష్ ను నియోజకవర్గం దాటించడానికి టిడిపి నాయకులకు ప్రాణాల మీదకు వస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సీఎం జగన్మోహన్రెడ్డి గారు రెండో సారి సీఎం అవుతారని, మైలవరంలో వైకాపా జెండానే ఎగురుతుందన్నారు.


ఈ సమావేశంలో మైలవరం మండల ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, సచివాలయ కన్వినర్లు, గృహసారథులు, వైకాపా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Comments