విశాఖ నగర పరిసరాల్లో కిరాయి మూకల వీరవిహారం

 


కిరాయి మూకల వీరవిహారం


ప్రశాంత విశాఖ నగర పరిసరాల్లో విలువైన స్థలాల కబ్జాయే లక్ష్యంగా పావులు కదుపుతున్న కొందరు కిరాయి మూకలను రంగంలోకి దించుతున్నారు.


దాడులతో భయానక వాతావరణం

భూ వివాదాల్లో విష సంస్కృతి

న్యూస్‌టుడే, విశాఖపట్నం


కిరాయి మూకల వీరవిహారం


ప్రశాంత విశాఖ నగర పరిసరాల్లో విలువైన స్థలాల కబ్జాయే లక్ష్యంగా పావులు కదుపుతున్న కొందరు కిరాయి మూకలను రంగంలోకి దించుతున్నారు.


ఏదొక వివాదం సృష్టించడం... అసలైన భూ యజమానులను ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిపోయింది. సొంత స్థలాలు ఉన్న భూ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. స్టేషన్లకు వస్తున్న కేసుల్లో భూ వివాదాలే అధికంగా ఉంటున్నాయి. కిరాయి మూకలను తెచ్చి భయం పెట్టడం.. దాడుల చేయడం అమాయకుల స్థలాలను ఆక్రమించుకోవడం వంటివి అధికమైపోతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు ఆ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ప్రయివేటు వ్యక్తులకు చెందిన ఆస్తులను ఆక్రమించడం, కబ్జా చేయడం వంటి విష సంస్కృతి పెరిగిపోతోంది.

కిడ్నాప్‌లు.. దాడులు


తగరపువలస సమీప తాళ్లవలసకి చెందిన హేమంత్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద రుషికొండ ప్రాంతానికి చెందిన రియల్టరు కె.మధుసూదనరావును కిరాయి మనుషుల సాయంతో రెండ్రోజుల కిందట కిడ్నాప్‌ చేయించారు. ఆయన వద్ద లక్షల్లో డబ్బు, కొంత బంగారం దోచుకున్నారు. గతంలో ఇదే వ్యక్తి భీమిలి మండలం జేవీఅగ్రహారానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని కిడ్నాప్‌ చేశారు. ఇతనిపై ఓ హత్య, కిడ్నాప్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.


* ఆనందపురం మండలం శొంఠ్యాంలో కొద్దిరోజుల కిందట ఇరువర్గాల మధ్య తలెత్తిన భూవివాదంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ కిరాయి మూక వచ్చి ఓ కుటుంబంపై దాడికి పాల్పడింది. దాదాపు 50 మందికి పైగా ఒకేసారి దూసుకొచి భయానక వాతావరణం సృష్టించారు.

* తగరపువలస, తాళ్లవలస, సంగివలస, వెల్లంకి, పెద్దిపాలెం, వేములవలస ప్రాంతాలు జాతీయ రహదారికి ఆనుకుని, నగరానికి సమీపంగా ఉంటాయి. ఇలాంటి చోట భూవివాదాలు నిత్యకృత్యమయ్యాయి.

* నెలరోజుల కిందట తాళ్లవలసలో భూవివాదంలో రైతులను నిలువరించేందుకు నగరానికి చెందిన కిరాయి మూకలను తెచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేశారు.

* భీమిలి మండలం కాపులుప్పాడ రెవెన్యూ పరిధి మంగమారిపేటలో కొద్ది నెలల కిందట బ్యాంకు వేలంలో చట్టబద్దంగా 65 సెంట్లను హైదరాబాద్‌కి చెందిన మూర్తి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి, తన అనుచరులతో కబ్జా చేస్తుండడంతో బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశారు.


ఆ ప్రాంతాల్లో..


కిరాయి మూకల వీరవిహారం


ఆనందపురంలో దాడులకు వచ్చిన కిరాయి మూక(పాత చిత్రం)


మధురవాడ, పీఎంపాలెం, కొమ్మాది మారికవలస, ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లో గజం భూమి ధర దాదాపు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంది. అలాగే సమీప కాపులుప్పాడ, బోయపాలెం, పరిదేశిపాలెం, వేములవలస, ఆనందపురం, తాళ్లవలస, తగరపువలస, సంగివలస, భీమిలి ప్రాంతాల్లోనూ గజం పాతికవేల రూపాయల పైమాటే. నగరానికి దగ్గరగా ఉండడంతో ఈ భూములకు బాగా డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు పంచాయతీలుగా ఉన్న ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రస్తుతం జీవీఎంసీలో భాగమయ్యాయి. మిలిగినవి వాటికి ఆనుకుని ఉండడంతో రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తాలన్న దుర్భిద్ది గల వ్యక్తులు నేరచరితగల రియల్టర్లు, పొరుగు జిల్లాల నుంచి వస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కిరాయిమూకలను రంగంలోకి దించుతున్నారు. వీరికి స్థానికంగా ఉన్న కొందరు నేతలు సహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలానికి చెందిన రైతులు నగరానికి వచ్చి వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త. తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డిని కలిసి శుక్రవారం తమ గోడు వినిపించారు. గూండాలు అధిక సంఖ్యలో వచ్చి తమను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ స్థలాలను కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేయడం గమనార్హం

Post a Comment

Comments