కండోమ్‌లకు బదులుగా వాడే కొత్తరకం టాబ్లెట్స్

పురుషులకు సంబంధించి వీర్య నియంత్రణ ఔషధాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది తాత్కాలికంగా ఎలుకల్లో వీర్యం ప్రవహించనీయకుండా అడ్డుకట్ట వేయగలిగి గర్భధారణను నిరోధించింది. సహజ సిద్ధమైన ఈ ప్రక్రియని  మార్చివేసే ఈ పరిశోధన పురుషుల్లో సంతాన నిరోధక మాత్రగా భవిష్యత్తులో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. అమెరికా లోని వెయిల్ కార్నెల్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతమైన ప్రక్రియను రూపొందించగలిగారు. సాధారణంగా పురుషులు సంతాన నియంత్రణ కోసం కండోమ్‌లు వాడడం, వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గత కొన్నేళ్లుగా వాడుకలోఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు సంతాన నియంత్రణకు ఇదొక్కటే అవకాశం ఉండేది. పురుషులకు సంబంధించి నోటి ద్వారా గాని లేక ఇంజక్షన్గ ద్వారా కానీ గర్భనిరోధక ఔషధాలను పంపించే విధానంపై పరిశోధనను శాస్త్రవేత్తలు పూర్తిగా ఆపివేశారు. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యభద్రతకు ప్రమాదం ఏర్పడి దుష్ఫలితాలు ఎదురవుతాయి అని. అయితే జన్యుపరంగా ఎలుకలు ముఖ్యమైన సంతాన కణజాల సంకేత ప్రోటీన్‌ను కోల్పోయేటట్టు శాస్త్రవేత్తలు చేశారు. ఈ ప్రొటీన్‌ను సాల్యుబుల్ ఎడెనిలిల్ సైక్లాస్ (ఎస్‌ఎఎస్) ( soluble adenyl cyclse) అని వ్యవహరించారు. ఇది సంతానం లేనిదానిగా మార్చగలిగారు. ఈ విధమైన ఎస్‌ఎసి నిరోధకాన్ని టిడిఐ 11861 అని పిలుస్తున్నారు.

దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఎలుక లోని వీర్యాన్ని రెండున్నర గంటల పాటు కదలనీయకుండా ఆప గలుగుతుంది. ఆ ప్రభావం సంయోగం తరువాత కూడా స్త్రీ పునరుత్పత్తి మార్గం లో కొనసాగుతుంది. మూడు గంటల తరువాత కొంత వీర్యం తిరిగి చలన శీలత ప్రారంభించ గలుగుతుంది. 24 గంటలు గడిచాకా  మొత్తం వీర్యం అంతా యథాతధ చలనాన్ని పొంద గలుగుతుందని పరిశోధకులు వివరించారు. మగ ఎలుక ఆడ ఎలుకతో 52 విభిన్న విధాలుగా సంయోగం చెందినా మామూలు సంయోగంలా ఉండేలా టిడిఐ 11861 చేయగలిగింది తప్ప గర్భధారణకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. తమ నిరోధకం (inhibitor) అరగంట నుంచి గంట లోపే తన ప్రభావాన్ని చూపిస్తుందని, అదే మారే ఇతర ప్రక్రియలైతే కొన్ని వారాలు పడుతుందని పరిశోధకులు చెప్పటం జరిగింది.

ఎస్‌ఎసి ఇన్‌హిబిటర్స్ కొన్ని గంటల్లోనే నిరోధకాలుగా పని ప్రారంభించే సామర్థం కలిగి ఉండినా, సంతానం పొందాలనుకున్నా లేదా అక్కరలేదనుకున్నా ఎప్పుడు ఈ ప్రక్రియ వినియోగించుకోవాలో పురుషులు ఏరోజుకారోజు నిర్ణయాలు తీసుకోడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎలుకల్లో చేసిన ఈ ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మనుషులకు కూడా ఎస్‌ఎసి ఇన్‌హిబిటర్స్ చక్కగా సరిపోయేలా తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ఔషధం అభివృద్ధి , క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు అందిస్తే “పురుషుల సంతాన నిరోధక మాత్ర ”గా వాడుక లోకి వస్తుందన్న ఆశాభావం వెలిబుచ్చారు.

Post a Comment

Comments