Telugu Movies on Lord Shiva మహా శివుడి మీద తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ఇలా చాలా మంది హీరోలు శివుడిగా నటించి మెప్పించారు. ఇప్పటి తరానికి అయితే శివుడిగా అంటే చిరంజీవి, బాలకృష్ణ గుర్తుకు వస్తారని చెప్పొచ్చు. శ్రీమంజునాథ సినిమాతో శివుడిగా చిరంజీవి అదరగొట్టేశాడు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోదనుడు ఇలా ఏ పాత్రలోనైనా మెప్పించే స్వర్గీయ ఎన్టీఆర్ ఒకప్పుడు శివుడిగా మెప్పించాడు.
దక్షయజ్ఞం, భూకైలాస్ ఇలా ఎన్నో సినిమాల్లో శివుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలని ఎంతగానో మెప్పించారు. ఇక ఏఎన్నార్ సైతం రెండు షాట్స్‌లో శివుడిగా కనిపిస్తారు. కానీ ఏఎన్నార్ ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో శివుడి పాత్రలో నటించలేదు. శోభన్ బాబు సైతం శివుడిగా కొన్ని చోట్ల కనిపించారు.
శివుడిగా కనిపించిన వారిలో కృష్ణంరాజు కూడా ముఖ్యులే. వినాయకవిజయం సినిమాలో శివుడిగా ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే భక్త కన్నప్ప సినిమాలో కృష్ణంరాజు నటన ఎప్పటికి మరువలేనిది. ఇక చిరంజీవి నటించిన శ్రీమంజునాథ సినిమా అయితే కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. శివుడిగా చిరంజీవి సరిగ్గా సరిపోయాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటారు.
ఇక శివుడిగా ప్రకాష్ రాజ్ కూడా నటించాడు.కానీ అది ఓ రెండు షాట్స్‌లోనే కనిపిస్తుంది. నాగార్జున అనుష్క నటించిన ఢమరుకం సినిమాలో శివుడిగా ప్రకాష్ రాజ్ నటించాడు. శివుడిగా గెటప్‌లో ప్రకాష్ రాజ్ ఓ చోట కనిపిస్తాడు. ఇలా తెలుగులో శివుడి మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. శివుడి మీద ఎన్నో సీరియల్స్ బుల్లితెరపై వస్తూనే ఉన్నాయి.
మహా శివరాత్రి అంటే తెలుగు వారు మాత్రం కచ్చితంగా భక్త కన్నప్ప సినిమాను చూస్తారు. ఈ సినిమాను కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి వారు మళ్లీ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా భారీ ఎత్తున తీయాలని ప్రయత్నించారు. కానీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. అటువంటి సినిమా లను మన తెలుగు ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు.
Comments