Rana Nayudu - 'రాణా నాయుడు' ట్రైలర్ నట విశ్వరూపం చూపించిన బాబాయ్ - అబ్బాయ్



విక్టరీ వెంకటేష్ - రానా దగ్గుబాటి లు మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రాణా నాయుడు (Rana Naidu). నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సిరీస్ నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా సిరీస్ నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ గా, వెంకీ క్రిమినల్ రోల్స్ లో కనిపించారు. వీరిద్దరూ ఇందులో తండ్రి కొడుకులు పాత్ర లో నటించారు . క్రిమినల్ అయిన తండ్రిపై కొడుక్కి చాలా కోపం. కనీసం తండ్రిని  నాన్న అని కూడా పిలవడు.

రానా నాయుడు యొక్క ట్రైలర్ చీకటి, తీవ్రత, థ్రిల్, యాక్షన్, ఎమోషన్ మరియు కొన్ని ఘనమైన ప్రదర్శనలను ఇస్తుంది. భారతీయ సినిమాలో వారి అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదించిన తర్వాత, వెంకటేష్ దగ్గుబాటి మరియు రానా దగ్గుబాటి ఎట్టకేలకు డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా యొక్క రాబోయే షో ‘రానా నాయుడు’తో ఇద్దరూ తమ డిజిటల్ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. పోలీస్ ఆఫీసర్ అయిన రానా నాయుడు.. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాడు. అక్కడ జరిగే స్కామ్ లు అన్నింట అతని హస్తం ఉంటుంది. తండ్రి నాగ నాయుడు (Venkatesh) జైలు నుంచి తిరిగి వస్తాడు. వాాళ్లిద్దరికీ అస్సలు పడదు. తన కుటుంబం కోసమే నాగ నాయుడు జైలుకెళ్లినట్లు ట్రైలర్ లో చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెంకీ తన రోల్ లో జీవించేశారు. నెరిసిన జుట్టు, గడ్డం తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇక ఇది బాలీవుడ్ సిరీస్ కాబట్టి కొన్ని బూతులూ వినిపించాయి. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10న విడుదల కాబోతోంది.

విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు, అలాగే విక్టరీ వెంకటేష్ తో నాగ చైతన్య, ఇలా సూపర్ హిట్ మూవీస్ మల్టీస్టారర్ గ నటించి ఇప్పుడు మరొక సూపర్ కాంబినేషన్ అయిన విక్టరీ వెంకటేష్ - రానా దగ్గుపాటి నటించిన (రానా నాయుడు)  ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది.  

Post a Comment

Comments