*పంతుళ్ళం కాదు..*
మేం *తరాల తయారీదారులం..* *(Teachers: Makers of Generations)*
*ఏముంది పంతుళ్ళు... ఏదో వస్తారు.... పోతారు....నాలుగు మాటలు తోచింది చెప్తారు... లేకుంటే సెలవులు.... ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు.*
*కానీ దానికి భిన్నం..మా వృత్తి.*
*ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4,5 గంటలు భరించలేని తల్లిదండ్రులు పిల్లల బళ్లకు పంపితే (వెల్లగొడితే)*
*ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లలని చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ,వమా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను, యాక్టర్లను, ఇంజినియర్ లను, పోలీసులను, కలెక్టర్లను, లాయర్లను, టీచర్లను, నాయకులను, అధికారులను ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా తరాలు *తరాలు తయారుచేసే నిత్య విద్యార్థులం మేము.*
*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.*
*చెమటను సాక్ష్యం గా చూపడానికి...*
*మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు. బట్టలకంటిన మురికిని చూపడానికి....*
*మా పనులు మూసలు కావు, మోసాలూ కావు.*
*ఏ రోజుకారోజు కొత్తే..*
*పిల్లాడు పిల్లాడికి కొత్తే..*
*ఏ రోజుకా రోజు సమస్యలూ కొత్తే..*
*మా వనరులు పిల్లలు మాత్రమే..*
*మా పని చదువొక్కటే కాదు, జీవితాలు తీర్చిదిద్దుడు కూడా...*
*ఏ రోజుకు ఆ రోజో, నెలకో, ఏడాదికో ఫలితాన్ని చూపే కూలీలమో, రైతులమో, అధికారులమో కాదు సుమా!?*
*తరాన్ని తయారు చేస్తూ పోతాం.. ఆ యజ్ఞం లో సమిధలవుతం..*
*ఎలాంటి ఫలితాన్ని ఆశించని నిత్య కార్మికులం..*
*మా చేతుల్లో నుండి ఒక్క పనికొచ్చే మనిషి తయారైన అదే మాకు లక్షలు, కోట్లు..*
*పుణ్యానికి చేస్తారా అని అంటారా?*
*మీ ఇంట్లో ఉన్న మీ స్వంత ఇద్దరు పిల్లలనే బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచండి... పెంచండి.. విద్య నేర్పండి.. బుద్ధులు నేర్పండి... విలువలు నేర్పండి... గొప్ప మేధావిని చేయండి... గొప్ప అధికారిని కనీసం ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తినో, ఆఖరికి సమాజాన్ని గాడిలో పెట్టే సాధువునో, సన్యాసినో చేయండి..*
*అప్పుడు ఒక గురువు గుర్తుకొస్తాడు... అప్పుడే ఒక ఉపాధ్యాయుడు గుర్తుకొస్తాడు... అప్పుడే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆథ్యాత్మికంగా, ఉద్వేగాల, భావాల పరంగా, అన్ని విధాలా శిక్షణ ఇచ్చే ఒక బడి గుర్తుకొస్తుంది..*
*ఎందుకండి కూర్చున్న కొమ్మను నరుకుతరు?!*
*అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి*
*అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ, పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు చూపలేని నిస్సహాయులం..*
*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు..*
*కించపరచకండి..*
*మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు..*
*తూలనాడకండి..*
*మాతోనో, మా సంతకంతోనో పని ఉంటే కదా! అంటారా?*
*అయితే సమాజంలో మిగిలేది మేధావులో, విలువలున్న మంచి మనుషులో కాదు..*
*మానవత్వం లేని మృగాలో, విలువల్లేని రోబోలో తయారవుతాయి... ఒకవేళ మీలా ఆలోచించి పంతుళ్ళు కూడా పక్క దోవ పట్టితే...*
*మాకు విలువివ్వండి...*
*విలువులన్న మనుషులను తయారుచేసే పనిలో తోడు రండి..*
*విలువులు తప్పిన ఒకరిద్దరు పంతుళ్ళను ఓ కంట కనిపెట్టండి.. వారిని మందలించండి...*
*విద్య బళ్లోనే, అదీ గురువు సమక్షంలోనే దొరుకుంతుందని గుర్తుంచుకోండి.*
Comments