మనసు మూగది... మాటలు రానిది అని సరి పెట్టుకుంటే సరిపోదు... సునామీలు సృష్టించే ఆలోచనలు చేయడమే దాని పని... అలాంటి మనసుని నిలకడగా కట్టడి చేసి పాజిటివ్ ఆలోచనలు అదే మనసు ద్వారా చేయించి ఆనందకర జీవితాన్ని అనుభవిస్తూ ఉంచే మార్గం సరైన సాధన... మనసుని కట్టడి చేసే మార్గం ఏదైనా ధ్యానం కిందే వస్తుంది... అలాంటి మనసుని నిలకడగా ఉంచే మార్గాన్ని మన పెద్దలు, గురువులు విశ్వ మానవాళికి అందించారు... మానవ జన్మ ఉత్తమమైనది, మహోన్నత మైనది.. సృష్టిలో ఏ జంతువు తోను పోల్చుకొలేనిది... అందులో అతి ముఖ్యమైనది, అందరూ చేసుకునే బుద్ధ ప్రభోదిత ఆనాపానసతి మార్గమే పత్రీజీ గురువు గారు అందరికీ అందించారు శ్వాస మీద ధ్యాసగా... ఆ మార్గంలో సాధకులు ప్రయాణిస్తూ మాటే మంత్రంగా విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం కొరకు గురువు గారి శాకాహార, ధ్యాన, పిరమిడ్ జగత్ సృష్టి మరియు దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు మనందరం ధ్యాన సాధన కొనసాగిద్దాం నమ్మకం, విశ్వాసంతో సరైన సాధన చేద్దాం...
మనిషిని మనీషి గా మార్చే సరైన సాధన చేస్తే నెగెటివ్ అలోచనలు భస్మాసుర హస్తం తో పాతిపెట్టి, సరైన సాధన ద్వారా సరైన దృష్టి పెడితే దృష్టి పెట్టగానే దేవుడే దిగివచ్చును అంటే అంతరాత్మ సందేశాలు ఆత్మ జ్ఞానం అందిస్తూ మహోన్నతంగా జీవిస్తూ ఉండాలి....సాధకులు సరైన సాధన గురించి ముందుగా తెలుసుకొని ఆ సాధన కొనసాగించాలి.👏👏👏
Comments