ట్విట్టర్ తన ఢిల్లీ మరియు ముంబై కార్యాలయాలను మూసివేసింది, ఇప్పుడు భారత్ లో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమె పనిచేస్తున్నారు, ట్విటర్ బెంగళూరు కార్యాలయంలో కేవలం కొంతమంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు, ఇకపై వారు US కార్యాలయానికి రిపోర్ట్ చేస్తారు.
2022లో భారీ తొలగింపుల తర్వాత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కార్యాలయాలను మూసివేస్తున్నారు. నివేదికల ప్రకారం, మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా దిగ్గజం తన మూడు భారతీయ కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని కోరింది. మస్క్ ఇప్పటికే భారతదేశంలోని దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులలో 90 శాతం మందిని తొలగించాడు. ఢిల్లీతో పాటు ముంబైలోని ట్విట్టర్ కార్యాలయాన్ని కూడా మస్క్ మూసివేశారు. ఇప్పుడు భారత్ లో. ట్విట్టర్ యొక్క బెంగళూరు కార్యాలయం మాత్రమె ఉంది,
బిలియనీర్ CEO అయిన ఎలోన్ మస్క్, ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను చాలామందిని ఇటీవలే తొలగించారు మరియు అనేక కార్యాలయాలను మూసివేశారు,
Comments