🔹వాట్సాప్🔹
ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్నీ ఫీచర్లను వాట్సాప్ అందిస్తున్నది. ఒకేసారి 256 మంది సభ్యులతో గ్రూప్ చాటింగ్ చేసేందుకు యాప్ సహకరిస్తుంది. ఒకేసారి చాలా మందికి సందేశాలను పంపొచ్చు. వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎనిమిది మందితో గ్రూప్ వీడియో కాల్స్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల తరహాలోనే వాట్సాప్ స్టేటస్(వాట్సాప్ స్టోరీస్) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
వాట్సాప్ ద్వారా అన్ని రకాల ఫైల్స్, డాక్యుమెంట్లను షేర్ చేసుకోవచ్చు. కానీ, ఇందులో ఫైల్ సైజుపై పరిమితులున్నాయి. ఫోటోలు, వీడియోలు, ఆడియో ఫైళ్ళ పరిమితి 16 MB మాత్రమే. 100 MB వరకు డాక్యుమెంట్లను పంపుకోవచ్చు. మీ కాంటాక్ట్‌లో ఉన్న వారితో లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ వంటి సేవల ద్వారా మీ సమాచారాన్ని బ్యాకప్, స్టోర్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది. క్లౌడ్ బ్యాకప్ పూర్తిగా ఉచితం.
🔹 టెలిగ్రామ్🔹
టెలిగ్రామ్ యాప్‌లో మంచి ఫీచర్లు ఉన్నాయి. వాట్సాప్ మాదిరిగానే, చాట్స్, గ్రూప్ చాట్స్, ఛానెల్స్ వంటి సేవలను పొందొచ్చు. వాట్సాప్‌లో ఉన్న 256 మంది సభ్యుల పరిమితికి భిన్నంగా, టెలిగ్రామ్ 2,00,000 మంది సభ్యులతో గ్రూప్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇది బోట్‌లు, పోల్స్, క్విజ్‌లు, హ్యాష్‌ట్యాగ్‌ల వంటి ఫీచర్లను అందిస్తోంది. గ్రూప్ చాటింగ్ బాగుంటుంది. టెలిగ్రామ్‌లో 1.5 జీబీ వరకు గల ఫైళ్లను షేర్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో వాయిస్, వీడియో కాల్స్ రెండింటిని చేసుకోవచ్చు.
🔹 సిగ్నల్🔹
సిగ్నల్ ద్వారా వినియోగదారులు మెసేజ్‌లు పంపడంతో పాటు వాయిస్, వీడియో కాల్ చేసుకోవచ్చు. మీ మెసేజ్‌లన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటాయి. ఇందులో కూడా గ్రూప్‌లు క్రియేట్ చేయొచ్చు.కానీ, ఒకేసారి ఎక్కువ మందికి మెసేజ్‌లను పంపించే అవకాశం లేదు. సిగ్నల్ ఇటీవల గ్రూప్ కాలింగ్‌ను ప్రవేశపెట్టింది. “నోట్ టు సెల్ఫ్” అనే అత్యుత్తమ ఫీచర్ ఇందులో ఉంది. వాట్సాప్‌లో మాదిరిగా ఏదైనా సమాచారాన్ని యూజర్ తనకు తానుగా పంపించుకోవడానికి సింగిల్ మెంబర్ గ్రూప్‌ను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
సిగ్నిల్‌లో ఐతే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సందేశం పంపేటప్పుడు మీకు వచ్చిన ఆలోచనలను సేవ్ చేసుకునే ఫీచర్ ఇందులో ఉంది. ఎమోజీలు, కొన్ని ప్రైవసీ స్టిక్కర్లు కూడా ఉన్నాయి, కానీ వాట్సాప్, టెలిగ్రామ్‌లతో పోల్చితే అవి ఇందులో చాలా పరిమితంగా ఉంటాయి. గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్‌లో చాట్‌లను బ్యాకప్ చేయడానికి అనుమతించదు. వ్యక్తుల అంగీకారం లేనిదే అటోమేటిక్‌గా గ్రూప్‌లలో ఎవరైనా యాడ్ చేయడానికి అనుమతించదు.
Comments