*_సీఎం జగనన్నపై మరింత నమ్మకాన్ని పెంచిన నవరత్నాలు_*
*_మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు_*
*_ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 2.3.2023_*
*_గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో సీఎం జగనన్నపై మరింత నమ్మకం పెంచుతున్నాయని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు._*
*_జి.కొండూరు మండలంలోని కవులూరులో ఆయన గురువారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో అన్న అంశంపై ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు._*
*_గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్నదని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు వెల్లడించారు._*
Comments