ఉపాధ్యాయులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ సభకు రప్పించారు.

 విశాఖపట్నం;

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆనందపురం మండల విద్యాశాఖాధికారిణి పద్మావతి మంగళవారం సభ నిర్వహించారు.


 ఉపాధ్యాయులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ సభకు రప్పించారు. 


ఈ విషయమై ఆమెపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. 


ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో జగనన్న కానుక కిట్లు ఇస్తున్నామని, వచ్చి తీసుకువెళ్లాలని ఎంఈఓ పద్మావతి మంగళవారం ఉదయం మండలంలోని ఉపాధ్యాయులకు మెసేజ్‌ పెట్టారు. 


ఈ మేరకు అక్కడకు వెళ్లిన ఉపాధ్యాయులు...అక్కడ వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా సభ ఏర్పాటుచేయడం చూసి విస్తుబోయారు.


 ఉపాధ్యాయులందరినీ బలవంతంగా సభలో కూర్చొబెట్టారు. 

సభలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులతో పాటు ఎంఈఓ పద్మావతి కూడా ప్రసంగించారు. 


వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఎంఈఓ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఆమెపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి . వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి ఎన్నికల్లో గెలవడానికి యత్నిస్తున్నారని విమర్శించాయి

Post a Comment

Comments