ఎన్పీఎస్ నిధిని రాష్ట్రాలకు తిరిగిచ్చే నిబంధన చట్టంలో లేదు

కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ 


🌻దిల్లీ: జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్) కింద జమ అయిన మూల నిధిని రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలన్న నిబంధన పీఎస్ఆర్డీఏ చట్టంలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, పంజాబ్, హిమా చల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పాత పింఛను విధానం (ఓపీ ఎస్)ను తిరిగి అమలు చేయాలనుకుంటున్నామని, ఎన్పీఎస్ కింద ఇప్పటి వరకు సమకూరిన మూలనిధిని తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఎన్పీఎస్కు ప్రభుత్వం, ఉద్యోగుల విరాళాల ద్వారా జమ అయిన మొత్తాన్ని సంబంధిత రాష్ట్రాలకు వెనక్కు ఇచ్చే నిబంధన పీఎస్ఆర్డీఏ చట్టం- 2013లో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. 

2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఓపీఎస్ ను అమలుచేయబోమని, అటువంటి ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు..

Post a Comment

Comments