ఏమి కాని వారు నేనున్నానని చేరదీసి ఆశ్రయం ఇచ్చి భద్రత కల్పించారు.
మహిళల రక్షణ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న దిశా పోలీసులు.
తిరుపతి మహానగరం అదే సమయంలో పుణ్యక్షేత్రం కూడా ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి దైవ దర్శనం కోసం ఎందరో వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ మహిళల రక్షణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాలతో దిశా పోలీసులు రెండు టీంలుగా ఏర్పడి నగరం అంతా కలియ తిరుగుతూ ఎక్కడ మహిళలకు రక్షణ తక్కువగా ఉంది అనే ఆలోచన వస్తుందో అక్కడే తిష్ట వేసి మహిళల రక్షణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టంగా విధి నిర్వహణ చేస్తున్నారు.
విధి నిర్వహణలో భాగంగా ఈ రోజు కూడా ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ నందు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా వారికి బిక్కు బిక్కు మంటు ఒక అమ్మాయి కంట పడింది చూసిందే తడవుగా వెంటనే అమ్మాయిని చేరదీసి వివరాలు సేకరించారు.
అప్పుడు అమ్మాయి తనది ఒంగోలని నేను ఒక వ్యక్తిని(బంధువు) నమ్మి తిరుమలకు వచ్చానని తిరుమలలో రూము తీసుకున్న తర్వాత బ్యాగులన్నీ అక్కడ పెట్టి తిరుపతికి వచ్చామని నాతో వచ్చిన అతను వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదని కంటతడి పెట్టుకున్నారు. పరిస్థితినీ అర్థం చేసుకున్న దిశా మహిళా పోలీసులు అతనికి ఫోన్ చేయగా అతను సమాధానం లేని సమాధానాలు చెప్పి నాకు సంబంధం లేదని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఇక చేసేది లేక అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించి జరిగిన విషయాలన్నీ తెలియపరిచి వారి తల్లిదండ్రులకు భద్రంగా అప్పగించడానికి పూనుకున్నారు. ఇక అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి కావల్సిన ఆహార పదార్థాలను అందజేసి ఆమె భద్రత దృష్ట్యా మహిళా ప్రాంగణం నందు అధికారుల ఆదేశాల మేరకు వారికి అప్పగించి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చేంతవరకు దిశా పోలీసులు బాధ్యత తీసుకొని పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా ఎస్పీ:-
తన పిల్లలే వారి భవిష్యత్తుగా నమ్మే తల్లిదండ్రుల మాటలను పెడచెవిని పెడుతున్నారు ఏ తల్లిదండ్రులైన పిల్లల భవిష్యత్తు వారు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటారు ఇదే సమయంలో పిల్లలు కూడా కొన్ని ఆకర్షణ వలన లేదా పరిస్తుల వలన కొన్ని బంధాలకు దగ్గర అవడం జరుగుతూ ఉంటుంది ఇది తప్పని చెప్పలేము ఒప్పు ఆని అనలేము. ఏదైనా బంధాలకు దగ్గరైనప్పుడు పెద్దలకు తెలియపరిచి వారిని ఒప్పించే మార్గాలను అన్వేషించాలి అదే సమయంలో మంచి భవిష్యత్తును కూడా ఎన్నుకోవాలి ఇదేమి చేయక ఆవేశంతో అనాలోచితమైన ఆలోచన వలన చాలామంది తల్లిదండ్రులు గురువుల మాటలను పెడచెవిన పెడుతున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఎవరికైనా పిల్లల భవిష్యత్తు వారి ఎదుగుదలే ముఖ్యం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో వారికి తెలియకుండా ఒంటరిగా రావడం, పరిచయం లేని వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకోవడం ఇదంతా వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుంది ఇది సమంజసం కాదు కావున యువతీ యువకులు వారి భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ఉన్నత స్థితికి వెళ్ళాలి అదే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల మాటలను కూడా విని మంచి మార్గంలో వెళ్లాలని ఆశిస్తున్నానని జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు ఒక సందేశం ఇచ్చారు.
Comments