*ప్రభుత్వ పాఠశాలల్లో వంట కార్మికులు,ఆయా ల జీతాల చెల్లింపుల పై ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం హర్షణీయం*
*సామాజిక స్పృహ, బాధ్యత తో విధులు నిర్వహిస్తున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్*
*అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రవీణ్ ప్రకాష్ తరహాలో సందర్శనలు జరగాలి.*
*నిరంతర పర్యవేక్షణతోనే వ్యవస్థలు బలోపేతం*
*ప్రవీణ్ ప్రకాష్ పై రాజకీయ విమర్శలు సరికాదు.*
*విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పనితీరు ప్రశంసనీయం*
*ఉద్యోగులపై చర్యలు కాకుండా. లోపాలను సరిదిద్దేలా అధికారుల సందర్శనలు ఉండాలి*
* ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు,వంట ఏజెన్సీల వేతనాలు చెల్లించే వరకు తన జీతం బిల్లు చేయొద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఎస్సీ ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సదన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలు,వంట ఏజెన్సీలకు చెల్లించే అతి తక్కువ వేతనాలను కూడా నెలలు తరబడి ఆలస్యంగా చెల్లించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్న నిర్ణయంతో కార్మికులకు సకాలంలో జీతాలు అందనున్నాయని తెలిపారు.ప్రవీణ్ ప్రకాష్ సామాజిక స్పృహ, బాధ్యత గల అధికారి అని సురేష్ బాబు అభివర్ణించారు.పెరిగిన నిత్యవసర వస్తువుల ఖర్చుల దృష్ట్యా కుకింగ్ ఏజెన్సీలకు చెల్లిస్తున్న ఖర్చుల మొత్తాన్ని పెంచాలని ప్రవీణ్ ప్రకాష్ ను కోరారు. సివిల్ సర్వీస్ అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రవీణ్ ప్రకాష్ మారుమూల గ్రామాలలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను సైతం సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రశంసనీయమని సురేష్ బాబు తెలిపారు. ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘం పక్షాన ఆయన్ని కలిసి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యాభివృద్దే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరినట్లు గుర్తు చేశారు. ఏ వ్యవస్థ అయినా లోపాలను అధిగమించి బలోపేతం కావాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రవీణ్ ప్రకాష్ పై కొందరు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.స్కూళ్లలో బాగా పని చేసే టీచర్లను అభినందిస్తూ వాళ్ళ పనితీరును తానే స్వయంగా సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేయడం అభినందనీయం అన్నారు.టీచర్లను అవమానకరంగా మాట్లాడుతూ వేధిస్తున్న పల్నాడు జిల్లా డిఇఓ ను ప్రవీణ్ ప్రకాశ్ తక్షణమే విధుల నుండి తప్పించారని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలకు అవినీతికి తావు లేకుండా పూర్తిస్థాయి సేవలు అందాలంటే ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు. పాఠశాలల సందర్శన సమయంలో ఉపాధ్యాయులు అధికారులపై చర్యలు లేకుండా లోపాలను గుర్తించి వాటిని సవరించుకొనేలా అవకాశం ఇస్తూ దేశంలో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత స్థాయిలో ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ ను కోరారు. ఈ కార్యక్రమంలో డి .కోటయ్య, ఎం. సుబ్బారావు ,ఎంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.*
Comments