*ఒంటరి మహిళపై కన్నేసిన అన్నదమ్ములు, అత్యాచారం ఆపై హత్య- గడ్డివాములో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు..అసలు ఏంటి?*
కాకినాడ జిల్లాలో సంచలనం రేపిన గడ్డివాములో గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఫిబ్రవరి 24న కాకినాడ జిల్లాలోని రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో పొలాల వద్ద గడ్డివాములో దగ్ధమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఒంటిరిగా ఉంటున్న ఓ వితంతువును అదే ప్రాంతంలో ఉంటోన్న ఇద్దరు అన్నదమ్ములు కలిసి అత్యాచారం చేసి వైరును మెడకు బిగించి చంపడమే కాకుండా దగ్గర్లో ఉన్న గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణలో తేలిన విషయాలను రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి వెల్లడించారు.
ముందు వేధింపులు.. ఆపై పగ..
మాచవరం గ్రామంలోని స్థానిక దేవుడు కాలనీలో కొవ్వూరి సత్యవేణి అనే మహిళ భర్త మృతిచెందగా ఒంటరిగా జీవిస్తోంది. ఒంటిరిగా ఉంటున్న సత్యవేణిపై ఇదే కాలనీలో ఉంటోన్న నల్లమిల్లి ఉమామహేశ్వర రెడ్డి, వెంకటసత్యనారాయణ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ముల కన్నుపడిరది. దీంతో సత్యవేణిని పలుసార్లు వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా అసభ్యంగా కూడా ప్రవర్తించడంతో ఆమె స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో గ్రామ పెద్దలు మందలిండంతో సత్యవేణిపై పగ పెంచుకున్నారు అన్నదమ్ములు. సత్యవేణిని అత్యాచారం చేసి హత్య చేయాలని ఫ్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒంటరిగా వస్తున్న సత్యవేణిని గమనించి నిందితులిద్దరూ చినతలుపులమ్మ లోవకు వెళ్లే సమీపంలో మహిళను నిర్మాణుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అక్కడ దొరికిన వైరును మహిళ మెడకు బిగించి చంపారు. ఆమె శరీరంపై ఉన్న బంగారు వస్తువులను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఉన్న గడ్డివాములో పెట్టి దగ్ధం చేశారు.
మిస్టరీ నుంచి హత్య కేసుగా
గడ్డివాములో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాన్ని గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఆ మృతదేహం పురుషునిదా లేక మహిళదా అన్నది కూడా గుర్తించలేనంతగా కాలిపోవడంతో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. గడ్డివాము సమీపంలో మహిళ చెప్పులు, పగిలిన గాజు పెంకులు కనపడడంతో మహిళగా గుర్తించి ఆపై అదృశ్యం అయినవారి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే మాచవరంలోని దేవుడు కాలనీలో సత్యవేణి కనిపించడంలేదని గుర్తించారు గ్రామ మహిళా పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తు బృందానికి తెలియచేయడంతో అదే రోజు నుంచి ఇద్దరు అన్నదమ్ములు కనడడం లేదని గమనించడంతో వారి కదలికలపై దృష్టిసారించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో అసలు విషయాన్ని కక్కారు నిందితులు. వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచగా కోర్టు రిమాండ్ విధించింది.
నిందితుల తల్లి ఆత్మహత్య..
పోలీసులు ప్రెస్‌మీట్‌లో హత్య జరిగిన విధానం వివరించకముందే గ్రామంలో ఈ హత్యకు పాల్పడింది ఇద్దరు అన్నదమ్ములైన ఉమామహేశ్వరరెడ్డి, వెంకటసత్యనారాయణరెడ్డి అని బయటకు పొక్కడంతో నిందితుల తల్లి పద్మ ఈనెల ఎనిమిదిన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికి నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. చివరకు బంధువులే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది
Comments