మంచిదే ఇన్నాళ్ళకు మంచి ఆలోచన వచ్చింది.... మన ఇల్లు శుభ్రంగా, అందంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటే మనం ఏమి చేయాలి..... ఇంటికి పట్టిన బూజు, చెత్త, చెదారం తొలగించాలి. ఇంట్లో సామాన్లు అన్ని ఒక పధ్ధతి లొ ఉంచాలి. పనికి రాని వస్తువులు, ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులు బయట పడేయాలి అంతే కదా......
మరి మనం ఆనందంగా ఉండాలంటే చేయవలసినది అదే....... ముందు ఇప్పటికే మన మనస్సుల్లో ఉన్న చెత్త.. మన ప్రవర్తనలో ఉన్న చెడు అలవాట్లు జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుగా అవతల పారేయాలి..... ఆనందంగా ఉండాలంటే మనలో తొలగించుకోవలసిన మరియు వదిలించుకోవలసిన ఈ చెత్త ఏమిటో చూద్దాం.......*
🌿1. పనికిమాలిన మరియు ఇబ్బంది పెడుతున్న బంధాలను, బంధుత్వాలను మనసులోంచి బయటపడేయండి:
అదేమిటండి? అంత మాట అనేసారు అని మీకు అనిపించవచ్చు. కాని తప్పదు . మనకు చికాకులు తెప్పిస్తూ మన ఆనందాన్ని హరించి వేస్తూన బంధాలు .. స్నేహాలు మనసులోంచి బయట పడేయండి. ఎంతకు మారని వారిని మారుతారని ప్రయత్నించడం..... మనం ఎంత సర్డుకుపోతున్న మన గురించి నలుగురికి చెడు ప్రచారం చేసేవారిని పట్టుకొని వేలాడటం వలన మన ఆనందం ఆవిరై పోతుంటుంది. మన కన్నా మనకి ఎవరూ ముఖ్యం కాదు... అటువంటి వారు ఫేస్ బుక్ స్నేహితులైన, వాస్తవ ప్రపంచం లోని స్నేహితులైన, బంధువులైన, రాబందువులైన జాగ్రత్త గా పరిశీలించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసి డిలిట్ బటన్ నొక్కండి.. ఆనందాన్ని కాపాడుకోండి...
🌿2. ఒత్తిడి కి దూరంగా ఉండండి:
జీవితం ప్రెషర్ కుకర్ కాదు. ప్రతీ చిన్న విషయానికి పెద్ద విషయానికి తీవ్ర ఒత్తిడికి లోనవడానికి.... ఒత్తిడికి లోనైతే ఆనందమే కాదు ఆరోగ్యం కూడా అటక ఎక్కుతుంది. మనం ముందు ఉంటేనే కదా... ఆయా పనులు అయ్యేవి లేనివి చూడటానికి... జరిగేవి ఎలాగు జరగక మానవు..... కాబట్టి ప్రతీ విషయానికి తీవ్రంగా స్పందించి ఒత్తిడి తెచ్చుకొనే తత్వాన్ని వీలైనంత త్వరలో తుడిచి అవతల పారేయండి.....
🌿3. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టె చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి:
అతి నిద్ర కాని, బద్ధకం గాని, సోమరితనం గాని, అతి స్నేహాలు గాని, ఫేస్ బుక్ గాని, చాటింగ్ కాని, బాతాఖానీలు గాని , విండో షాపింగ్ కాని , ఇలా ఏవైనా మీకు ఇబ్బంది పెడుతూన అలవాట్లు తాత్కాలికంగా మీకు ఆనందం కలిగిస్తున్న శాశ్వతంగా తీవ్ర ఇబంది కలిగించవచ్చు. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు ఏమిటో గుర్తించి ఫినాయిల్ వేసి కడిగి అవతల పారేయండి......
🌿4. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నించకండి:
భగవంతుడు ఈ జీవితాన్ని మనకి కానుకగా ఇచ్చాడు. ఆనందంగా జీవిస్తూ నలుగురినీ ఆనందంగా ఉంచడం మంచిదే కాని అందరినీ సంతృప్తి పరచడం వలన మనం ఆనందంగా ఉంటాం అనుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆత్మ సంతృప్తిని మించిన ఆనందం ఎక్కడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆఖరికి ఇంట్లో పనిమనిషిని, వాచ్ మేన్ ని ఆఫీస్ లొ బాస్ ని, కొలీగ్స్ ని, బంధువుల్ని అందరినీ సంతృప్తి పరుస్తూ జీవించాలనే మీ మహా యజ్ఞం మీద చన్నీళ్ళు పోసి హాయి గా ఉండండి.
🌿5. ఎవరో అపార్థం చేసుకున్నారు సరిగా అర్థం చేసుకోలేదు అనే భావాన్ని విడిచి పెట్టండి:
ఉదాహరణకి మీరు కొరియా లేదా జపాన్ సినిమా చూసారు .. మీకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అది ఎవరి తప్పు ఆ సినిమా డైరెక్టర్ దా, హీరో దా, లేదా ఆ సినిమా ఆడుతున్న థియేటర్ దా? ఆ భాష రాకుండా చూసిన మనదే కదా ! అంటే ఎవరో గాడిద మనల్ని సరిగా అర్థం చేసుకోలేక ఓండ్ర పెడుతుంటే ఆ తప్పు ఎవరిదీ. అదేంటండి గాడిద అనేసారు అంటారా ? సారీ గాడిదను అవమాన పరిచినందుకు...... వాళ్లకు మనం అర్థం కాక పొతే మంచి డిక్షనరీ కొనుక్కొని నేర్చుకోమనండి.... ఎవరో అపార్థం చేసుకున్నారని ముక్కు చీదు కొని ఏడుపు మొదలెట్టవద్దు..... ముందు మొహం కడుక్కొని అద్దంలో మీ ముఖారవిందాన్ని ఆనందించండి......
🌿6. ఎవరిని అనవసరంగా అనుకరించవద్దు.:
మీరు మీరే..... ఎవరి నుండైనా ప్రేరణ పొందండి తప్పు లేదు కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు గుడ్డిగా ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించవద్దు. ఎందువలన అంటే ఒకరిని అనుసరించాలని లేదా ఒకరిలా ఉండాలని ప్రయత్నిస్తే అది లేని పోనీ తలనొప్పులకు దారి తీస్తుంది. అనుకరణ వేరు అనుసరణ వేరు, అనుకరణ అనేది మూర్ఖత్వం మన వ్యక్తిత్వాన్ని , అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అనుసరణ మన వ్యక్తిత్వానికి కొత్త సొగసులు అద్దుతుంది. మనం మనలా ఉండటం లో ఆనందం. మనలను మనం గా స్వీకరించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి దేనిలోనూ ఉండదు.
🌿7. ఎవరిని విపరీతంగా ద్వేషించవద్దు అలా అని ఎవరిని విపరీతంగా ప్రేమించవద్దు:
అతి సర్వత్రా వర్జయేత్ .. ద్వేషం అనర్థదాయకం.
Comments