ఓ చిన్న చిరు నవ్వు నవ్వితే అది అందం, ఇతరులను నవ్విస్తే అది ఆనందం , నువ్వు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ పది కాలాలపాటు నడిస్తే అదే అనుబంధం, ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.
జీవితంలో మూడు ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోండి ! . మన మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నివ్వు ఉండాల్సిన అవసరం లేదు. మన కన్నీళ్ళకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరంలేదు మిత్రమా.
అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని ఎవరి గురించీ బాధపడకు వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులో మనం గుర్తోస్తామని సంతోషించు.
మనలో చాలా మంది మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని చాలా సార్లు అనుకుంటాం. కానీ ! ఒక్కటే గుర్తు పెట్టుకో నువ్వు ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఆ రోజు ఇంకెప్పటికీ రాదు.
మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగ పిల్లాడికి ఒక మహిళను ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. ఏదైనా మన పెంపకం లోనే ఉంటుంది.
జీవితంలో పరిచయమైన స్నేహాలు ఎన్నో కానీ ! మనస్సుకు హత్తకునేది కొందరే వారే మన ఆత్మీయులు.
Comments