Reporters: రిపోర్టర్ల పై రేషన్ మాఫియా దాడి

 రిపోర్టర్ల పై  రేషన్ మాఫియా  దాడి


అక్రమ రేషన్ నిల్వ ఉంది అని సమాచారం అధికారులకు తెలిపినందుకు  మీడియా రిపోర్టర్ల పై దాడి చేసిన రేషన్ మాఫియా డాన్ దీపు 


 జి కొండూరు మండలంలో  జిల్లా వాణి రిపోర్టర్ గూడేళ్ల ప్రకాష్, నల్లమోతు నరేష్, మర్రి ప్రవీణ్, మరో వ్యక్తిపై రేషన్ మాఫియా వ్యక్తులు విరుచుకుపడ్డారు.


 ఓ చోట అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ సమాచారాన్ని సంబంధిత అధికారులకు మీడియా వ్యక్తులు తెలపటంతో  అధికారులకు సమాచారం అందిస్తారా అంటూ నలుగురు రిపోర్టర్లను చితకబాదారు.


 రేషన్ మాఫియాకు అండగా నిలుస్తున్న  దీపు అనే వ్యక్తి  రిపోర్టర్లను చితక పాదాడు.


 గతంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో అక్రమ రేషన్ తరలింపులో   ఇతనిపై    కేసు నమోదు

చేసిన పోలీసులు...


 కొండపల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ  అక్రమ రేషన్ మాఫియాకు కొమ్ముకాస్తున్నాడన్నట్టు సమాచారం..

Post a Comment

Comments