హిమాలయాల మీదుగా విమానాలు వెళ్లవని విన్నాను. నిజమేనా? అలా ఎందుకు?

 ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వతశ్రేణి హిమాలయ పర్వతాలు. వాటిమీదుగా విమానాలు వెళ్లకపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.


* విమానాలకు ఎప్పటికప్పుడు ఉపగ్రహాల ద్వారా విమానాల్లో ఉన్న కంట్రోల్‌ టవర్ల ద్వారా సమాచార సంకేతాల సరఫరా జరుగుతూనే ఉండాలి. పైగా అవసరమైతే ఉపగ్రహాల ద్వారా జీపీయస్‌ ద్వారా దారి ఎటు వెళ్తున్నాయో కచ్చితంగా తెలియాలి. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో ఈ నిస్తంత్రీ సంకేతాల ప్రయాణం (వైర్‌లెస్‌ ట్రాన్స్‌మిషన్‌) సజావుగా సాగదు.


* విమానాల ప్రయాణానికి ఇంధనంతో పాటు గాలిలోని ఆక్సిజన్‌ చాలా అవసరం. హిమాలయ పర్వతాల మీద గాలి పీడనం చాలా తక్కువ. ఆక్సిజన్‌ పరిమాణం ఇంకా తక్కువ. కాబట్టి విమానాల ఇంజిన్లలో ఇంధనం మండేందుకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరకదు. అందుకే పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్‌ సిలిండర్లు పట్టుకెళ్తారు.


* విమానాలు ఎగిరేందుకు రెక్కల మీదుగా, రెక్కల కిందుగా గాలి ప్రయాణిస్తేనే విమానం ఎగరగల్గుతుంది. గాలి పీడనం హిమాలయాల్లో తక్కువ కాబట్టి ఈ సదుపాయం ఉండదు.

Post a Comment

Comments