ఒళ్లు గగుర్పాటు చెందితే రోమాలు లేచి నిలబడతాయి/నిక్కబొడుచుకుంటాయి. ఎందుకు❓

జవాబు: చలి, భయము, అందోళన వంటివి కలిగినప్పుడు మన శరీరంపై గల రోమాలు లేచి నిలబడతాయి. అప్పుడు శరీరము గగుర్భాటు చెందుతుంది. శరీరంపై ఉండే ప్రతి వెంట్రుక క్రింద చిన్న కండరము ఉంటుంది. అది సంకోచించినప్పుడు ఆ వెంట్రుక లేచి నిలబడుతుంది. మన శరీరంలోని స్వతంత్ర నాడీవ్యవస్థ ప్రభావంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి . దీనిని శాస్త్రీయముగా "Pilo erection" అంటాం. 

ఆ సమయంలో వెంట్రుకల మధ్య గాలి బంధింపబడుతుంది. గాలి గదులు తయారవుతాయి. ఆ గాలి ఉష్ణబందక పదార్థంగా ఉంటుంది. అందువల్ల శరీరంలోని వేడి బయటికి పోదు. శరీరం వెచ్చగా ఉండి చలి నుంచి తట్టుకోగల శక్తి వస్తుంది. 


జంతువులలో ఈ పక్రియ తమ శత్రువుల్ని బెదిరించడానికి ఉపయోగపడుతుంది. పిల్లిలో ఇలా జరిగితే లావుగా తయారై చూడడానికి భయంకరంగా ఉంటుంది. దానిని చూసి శత్రువులు పారిపోతారు. మనకి ఆ అవసరం లేకపోయినా పరిణామరీత్యా (on the way of evolution) పాత గుర్తులు ఉండిపోయాయి. ఆ శరీర ధర్మం అలాగే ఉండిపోయింది. అది తప్పించుకోవాలంటే వేడినిచ్చే బట్టలు వేసుకోవాలి. భయం తగ్గిందుకోవాలి. వీలయినంత కామ్ గా ఉండాలి.

Post a Comment

Comments