ఫ్లెమింగో ఫెస్టివల్ 2025
పక్షి ప్రేమికులకు శుభవార్త: ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు సంవత్సరాల తరువాత తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట కేంద్రంగా 3 రోజుల పాటు జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ .
ఫ్లెమింగో ఫెస్టివల్ రేపటినుండి 20 తేది వరకు 3రోజుల పాటు చేయడనికి కుటమి ప్రభుత్వం ఘనంగా ఏర్పట్లు చేసారు.
ముఖ్యమైన ప్రాంతాలు:
తిరుపతి జిల్లాలోని నేలపట్టు, అటకానితిప్ప, సూళ్లూరుపేట, బివి పాలెం మరియు శ్రీసిటీలో జరగనుంది.
ఫ్లామింగో పక్షుల గురించి కొన్ని విషయాలు:
ఫ్లామింగో పక్షులు ప్రత్యేకమైనవి. ఇవి పింక్ రంగును తమ ఆహారంలో ఉండే బీటా-కెరోటిన్ వల్ల పొందుతాయి. ఇవి ఒక కాలు మీద నిలబడటం ద్వారా శరీర వేడి బ్యాలెన్స్ చేసుకుంటాయి. పక్షులకి ఉండే ప్రత్యేక ముక్కు ద్వార ఆహారాన్ని వడకట్టే ప్రత్యేక శక్తి ఉంటుంది. పిల్లలకు పింక్ మిల్క్ అందించడం ఫ్లామింగో పక్షుల
ప్రత్యేక లక్షణాలు. వీటిని ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాలో చూడవచ్చు. ఫ్లామింగో పక్షులు సామూహికంగా నివసించి, గుంపులుగా ప్రయాణిస్తాయి. ఇవి బలమైన ఊపిరితిత్తుల సహాయంతో రాత్రి సమయమున సుదూరాల ప్రయాణిస్తాయి. ప్రపంచంలో మొత్తం ఆరు రకాల ఫ్లామింగోలు ఉన్నాయి. ఇవి జీవన సరళిలో సమతుల్యత, ఆహార్యక శైలిని ప్రదర్శిస్తాయి. అందుకే ఫ్లామింగోలు ప్రకృతి అందానికి చిహ్నం.
Comments