BCCI 10 క్రమశిక్షణా మార్గదర్శకాలు: రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు
బి సి సి ఐ భారత్ క్రికెటర్స్ కోసం కొత్తగా కొన్ని మార్గదర్శకాలు చేసింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో భరత్ పేలవ ప్రదర్శన తర్వాత క్రమశిక్షణ మార్గదర్శకాలు రావడం ఒకింత క్రికెటర్స్ కి భయం పుట్టిస్తున్నాయి . ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత.. హెడ్ కోచ్, కెప్టెన్, చీఫ్ సెలక్టర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించి.. వీటిని ఖరారు చేసింది.
బి సి సి ఐ భారత్ క్రికెటర్స్ కోసం కొత్తగా చేసిన 10 మార్గదర్శకాలు:
- ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లలో(Participation in Domestic Matches) ఆడటం తప్పనిసరి:
- జట్టుతో కలిసి ప్రయాణించాలి(Traveling Separately with Families)
- బ్యాగేజీ విషయంలోనూ ప్లేయర్లంతా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. (Excess Baggage Limit)
- టూర్/ సిరీస్‌లకు ఆటగాళ్లు తమ వ్యక్తిగత సిబ్బంది తీసుకురావడంపై నిషేధం విధించింది.(Restriction on Personal Staff)
- బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఎవైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తే.. వాటిని ఆటగాళ్లే భరించాల్సి ఉంటుంది.(Sending bags to center of Excellence)
- జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో విధిగా పాల్గొనాలి. షెడ్యూల్ ప్రాక్టీస్ ముగిసే వరకు ప్లేయర్లందరూ అక్కడే ఉండాలి. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే హోటల్‌కు వెళ్లడానికి వీలులేదు. అందరూ ఒకేసారి కలిసి ప్రయాణించాలి.(Attendance at practice sessions)
- పర్యటనల సందర్భంగా ఆటగాళ్లు ఎలాంటి వ్యక్తిగత ఎండార్స్‌మెంట్‌లలో పాల్గొనకూడదు.
- పర్యటనల సందర్భంగా ఆటగాళ్లు ఎలాంటి వ్యక్తిగత షూట్‌లలో (Restrictions on personal shoots) పాల్గొనకూడదు.
- బీసీసీఐ నిర్వహించే అధికారిక షూటింగ్‌లకు ప్లేయర్లందరూ కచ్చితంగా అందుబాటులో ఉండాలి.
- షెడ్యూల్ కంటే ముందే మ్యాచ్‌లు ముగిసినా.. సిరీస్ లేదా పర్యటన ముగిసే వరకు ఆటగాళ్లు జట్టుతోనే ఉండాలి. ఇది జట్టు ఐక్యతను(unity) పెంపొందిస్తుంది
Comments