Daily quotes Sasi News

 జీవిత పరీక్షలకూ సిద్దంగా ఉండాలి...!

బడిలో చదువుకునేటప్పుడు పరీక్షలకు ఎలా సిద్దంగా ఉన్నామో.. జీవితంలో ఎదురయ్యే కఠిన పరీక్షలకూ మనం అలాగే సన్నద్ధమవ్వాలి. అందుకోసం ముందస్తు తయారీ  వ్యవహరిస్తూ నిరంతరం.. శారీరకంగా- ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. మానసికంగా- పట్టుదల పెంచుకోవాలి. మేధోపరంగా- నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉండాలి. సన్నద్ధతతో మన జీవన ప్రయాణం సులువవుతుంది.

                        -అనిక్ అడిన్, కంటెంట్ క్రియేటర్

ఇంధనం అయిపోతున్నా పట్టించుకోకుండా వెళ్తారా?

మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేనంత బిజీగా మీరు ఉండటమంటే.. మీరు నడుపుతున్న వాహనంలో ఇంధనం అయిపోతున్నా, తిరిగి నింపుకొనేందుకు సమయం కేటాయించుకోలేకపోవడమే! అలాంటప్పుడు కాస్త ముందో వెనకో మీరు ఆగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా బాగా ఇబ్బందికర స్థితిలో. ఆరోగ్య పరిరక్షణకు రోజూ సమయం కేటాయించుకోండి. మీ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంటుంది.

                                     -సునీల్ ధండ్, వైద్యుడు

బృంద సభ్యులు మాట్లాడటానికి భయపడితే..!

ఒక బృందంలోని సభ్యులు తమ అంతర్గత సమావేశంలో మాట్లాడటానికి భయపడుతున్నారంటే.. అది బృంద నాయకుడి ఘోర వైఫల్యం కిందే లెక్క! బృంద సభ్యులకు నాయకుడు ఎప్పుడూ మానసికంగా భరోసా కల్పించాలి. ధైర్యంగా మాట్లాడేలా వారిని ప్రోత్సహించాలి.అప్పుడే బృంద పనితీరు మెరుగుపడి.. ఆశించిన ఫలితాలు దక్కుతాయి.

                     -కెన్ లిటిల్, మనస్తత్వ నిపుణుడు

స్పష్టత కోసం వేచిచూడకండి!

పూర్తి స్పష్టత వచ్చాకే కార్యరంగంలోకి దిగాలని భావించి వేచిచూస్తున్నారా?

అయితే మీరు పనిని ప్రారంభించే సమయం ఎప్పటికీ రాకపోవచ్చు కూడా! అతిగా ఆలోచించడం ద్వారానో, సుదీర్ఘంగా ప్రణాళికలు వేసుకుంటూ ఉండటం ద్వారానో దాదాపుగా ఏ విషయంలోనూ పూర్తిస్థాయి స్పష్టత రాదు. ధైర్యంగా, కుతూహలంతో పనిని ప్రారంభించండి. స్పష్టత క్రమంగా దానంతట అదే వస్తుంది.

                                 -మేరీ ఫొర్లియో, రచయిత

Post a Comment

Comments