"అందరికీ ఇల్లు పధకం" గురించి పూర్తి వివరాలు
G.O.MS.No.23 (27-01-2025)
ఆంధ్రప్రదేశ్ లో మొదలైన పధకాలు . "అందరికీ ఇల్లు పధకం" కి సంబందించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 27/01/2025 న మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ పధకం ముఖ్య ఉద్దేశం:
గ్రామీణ ప్రాంత ప్రజలకి : 3 సెంట్లు.పట్టణం ప్రాంత ప్రజలకి : 2 సెంట్లు లేదా ప్రభుత్వం నిర్మించిన గృహాలు ఇవ్వడం.
ముఖ్యమైన అంశాలు :
ఎంత స్థలం ఇస్తున్నారు ?:
గ్రామీణ ప్రాంత ప్రజలకి : 3 సెంట్లు.
పట్టణం ప్రాంత ప్రజలకి : 2 సెంట్లు లేదా ప్రభుత్వం నిర్మించిన గృహాలు ఇవ్వడం.
పట్టణం ప్రాంత ప్రజలకి : 2 సెంట్లు లేదా ప్రభుత్వం నిర్మించిన గృహాలు ఇవ్వడం.
ఈ పధకానికి అర్హులు ఎవరు ?:
- లబ్ధిదారుడు BPL(BELOW POVERTY LINE ) కుటుంబానికి చెందినవారై ఉండాలి (వైట్ రేషన్ కార్డు అవసరం).
- స్వంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు .
- గతంలో ఏ ప్రభుత్వం లోను గృహ పథకంలో లబ్ధి పొంది ఉండకూడదు .
- వ్యవసాయ భూమి 5 ఎకరాలు లేదా 2.5 ఎకరాలు (మాగాణి ) కంటే ఎక్కువ ఉండకూడదు.
- ఆధార్ కార్డు మొబైలు నెంబర్ కి అనుసందనం తప్పనిసరి కలిగిఉండాలి .
ఈ పధకానికి ఉండే ముఖ్యమైన నిబంధనలు :
- ఇల్లు లేదా స్థలం పత్రాలు ఇంటిలోని మహిళ పేరుతో మాత్రమే ఇస్తారు.
- లబ్ధిదారుడు రెండు సంవత్సరాలు లో ఇల్లు నిర్మించాలి.
- జీవితంలో ఒక్కసారే మాత్రమే పత్రం పొందే అవకాశం ఉంటుంది.
ఈ పధకానికి ఇచ్చే భూముల గుర్తింపు ఎలా ఉంటుంది .. :
- ప్రభుత్వ భూములు మరియు ఖాళీ స్థలాల భూములను గుర్తించి ఇవ్వడం.
- అవసరమైతే భూములను కొనుగోలు లేదా సేకరించడం .
ఈ పధకానికి సంబందించిన అప్లికేషన్ ప్రక్రియ మరియు పర్యవేక్షణ :
- గ్రామ లేదా వార్డు స్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
- స్థానిక అధికారుల ద్వారా అర్హతను నిర్ధారించుకుని అర్హుల జాబితాను కలెక్టర్ ఆమోదిస్తారు.
- రాష్ట్ర మరియు జిల్లా స్థాయి కమిటీలు అమలును పర్యవేక్షిస్తాయి.
- జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారు .
CANCELLATION ప్రక్రియ :
మోసపూరితంగా పొందిన పత్రాలు లేదా 2 ఏళ్లలో వినుయోగించుకొని స్థలాలు రద్దు చేయబడతాయి.ప్రత్యేక అంశాలు:
- 10 ఏళ్ల తరువాత స్థలం మాత్రమే ఫ్రీ హోల్డ్ గా మారుతుంది.
- పాత అప్లికేషన్లు లబ్ధిదారుని అనువుగా వేరే స్థలం లోకి మార్చుకొనే విలుఉంటుంది .
Comments