సినిమా రివ్యూ : SANKRANTHIKI
VASTUNNAM
ఒక పెళ్ళాం
మరియు మాజీ ప్రేయసి మద్య నలిగిన ఒక సగటు మగడి ఒక్క వ్యధ ని సరాధగా తీసినదే ఈ చిత్రం. ఓపెన్ చేస్తే సత్య ఆకెళ్ళ అలియస్ ఆకెళ్ళ
పాపులర్ సిఈఓ ఇండియా కి వస్తాడు. తెలంగాణ బిడ్డ
అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పట్టుపట్టి మరి ఆకెళ్ళ గారి మొదటి స్పీచ్ తెలంగాణ
లోనే ఉండాలి అని చెప్పి తెలంగాణ కి ఇన్విటే చేశారు అప్పుడు ఆయన వచ్చిన సందరబ్బమ లో
ఫామ్ హౌస్ లో పార్టీ ఇవ్వడం , ఆ పార్టీ లో ఆకెళ్ళ గారు కిడ్నాప్ అవ్వడం తో ఈ చిత్రం
స్టోరీ మొదలవుతుంది. అక్కడ సెక్యూరిటీ గా ఐపిఎస్ అయిన మీనాక్షీ ఉంటారు .
ఇప్పటినుండి మన హీరో వై డి రాజు (వెంకటేష్ ) ఆయన బార్య భాగ్యం ( ఐశ్వర్య
రాజేష్) మరియు వల్ల కొడుకు బుల్లి రాజు (రేవంత్) ఎంట్రీ తో కథ మొదలవుతుంది. మీనాక్షీ
, వెంకటేష్ గారి సహాయం తో ఆకెళ్ళ గారిని ఎలా కాపాడారు అనేదె మన సినిమా .
పాజిటివ్స్ :
1.
పాటలు
: అన్నీ చాలా వినసొంపుగా ఉన్నాయి . ముఖ్యం గా గోదారిగట్టు .. పాట ఆకట్టుకుంది
2.
ఐశ్వర్య
రాజేష్, బుల్లి రాజు యాక్టింగ్ సినిమా ని వారి
బుజస్కంధాల పై మోసరు .
3.
విక్టరీ
వెంకటేష్ మరియు మీనాక్షి చౌదరి తదితరులు వారి పరిధి మేరకు మీపించారు .
నెగిటివ్స్:
1. విల్లన్
పాత్రను ఇంకా తీర్చిదిద్ది ఉంటే బాగుండెది .
ఒవెరల్ సినిమా పై అభిప్రాయం :
లాజిక్స్ గురించి ఆలోచించకుండా కుటుంబ సమేతం
గా వెళ్ళి కడుపుబ్బ నవ్వుకొనే సినిమా .
రేటింగ్ : 3.5 /5
REVIEW BY DEDEEPYA
Comments