Swachh Andhra - Swachh Divas: ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం.

 ఏపీ రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం.

దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్(SwachhAndhrapradesh)తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ప్రతి  మూడోవ శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని సీఎస్ విజయానంద్ అన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇకపై ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్(Swachh Andhara - Swachh Divas) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చే ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ భాగస్వామ్యులు కావాలని అందరికీ సూచించారు.

12 నెలలకు 12 థీమ్‌లతో కార్యక్రమాలు:

జనవరి: క్లీన్ స్టార్ (Clean Star)

వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రతకు ప్రాధాన్యం. దైనందిన శుభ్రత, పర్యావరణ పరిశుభ్రతపై చర్చ.

ఫిబ్రవరి: సోర్స్-రిసోర్స్ (Source-Resource)

వనరుల పరిరక్షణ, సద్వినియోగం. నీరు, శక్తి, ముడిసరుకు వంటి వనరుల నిర్వహణ పద్ధతులు.

మార్చి: ప్లాస్టిక్ ఉపసంహరణ (Avoid Single-Use Plastics, Promote Reusables)

సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నివారణ, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం. ప్లాస్టిక్ కాలుష్య ప్రభావం.

ఏప్రిల్: ఈ-చెక్ (E-Check)

శక్తి ఆదా చర్యలు, రిన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగం. పరికరాల శక్తి సమర్థత ఆడిట్.

మే: నీటి సంరక్షణ (Water Conservation)

వర్షజలాలు, భూగర్భ జలాల పరిరక్షణ. నీటి ఆదా మార్గాలు.

జూన్: బీట్ ది హీట్ (Beat the Heat)

వేసవి తాపానికి పరిష్కారాలు. ప్రాకృతిక చల్లదనం కోసం చెట్లు, గ్రీన్ స్పేసెస్ ప్రోత్సాహం.

జూలై: ప్లాస్టిక్ కాలుష్యం నివారణ (Ending Plastic Pollution)

ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాలు, ప్రత్యామ్నాయ ఉత్పత్తుల ప్రోత్సాహం.

ఆగస్టు: వర్షాకాల పరిశుభ్రత (Monsoon Hygiene)

వర్షాకాలంలో వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కాలుష్యం నివారణ.

సెప్టెంబర్: గ్రీన్ AP 

ఆంధ్రప్రదేశ్ పచ్చదనం ప్రోత్సాహం. అటవీ సంరక్షణ, పర్యావరణ చర్యలు.


అక్టోబర్: క్లీన్ ఎయిర్ (Clean Air)

గాలి కాలుష్యం తగ్గించడానికి చర్యలు. వాహనాల వినియోగం తగ్గింపు, శుభ్రమైన వంట పద్ధతులు.

నవంబర్: వ్యక్తిగత, కమ్యూనిటీ పరిశుభ్రత (Personal &Community Hygiene)

హైజీన్ ఆవశ్యకత, శుభ్రత పెంపు చర్యలు. స్వచ్ఛంద కార్యక్రమాలు.

డిసెంబర్: పర్యావరణ అవకాశాలు (Opportunities in Environment)

గ్రీన్ టెక్నాలజీ, సుస్థిర ఉపాధి అవకాశాలపై చర్చ. పర్యావరణ రంగంలో ఆవిష్కరణలు.


Post a Comment

Comments