ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవం: వాట్సాప్ గవర్నెన్స్ - WhatsApp Governance in A.P

 


ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ – డిజిటల్ పరిపాలనలో నవసకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ పాలనలో ముందడుగు వేసింది. 2025 జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తిసుకువచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు  నేరుగా ప్రభుత్వ సేవలు పొందే అవకాశం ఉంది.

వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్యమైనా హైలైట్స్:

దేశంలోనే తొలిసారి(First in India )ఈ తరహా డిజిటల్ సేవలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
161 రకాల సేవలు మొదటి విడతలో అందుబాటులోకి రావడం జరిగింది.
సమాచార గోప్యత & సైబర్ సెక్యూరిటీ (Privacy )– సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నరు.
జనరేటివ్ AI ఉపయోగం – వేగంగా, సులభంగా సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు ఉపయోగించారు.
వాట్సాప్ నంబర్: 9552300009


ఎవరు ప్రయోజనం పొందగలరు?

ఈ సేవలు ఏపీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు, బిల్లులు, పథకాల సమాచారం పొందొచ్చు.  డిజిటల్ విప్లవం వల్ల ప్రజలకి ఎంత సమయం అదా అవుతోంది.

 ఏ సేవలు ప్రజలు కి అందుబాటులో ఉంటాయి?

1. దేవాదాయ శాఖ (Endowment Department):

✔ ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, విరాళాల  సదుపాయం తేలికైనది   .

2. రెవెన్యూ శాఖ Revenue Department):

ల్యాండ్ రికార్డులు, ఇతర సర్టిఫికెట్ల స్టేటస్ & డౌన్లోడ్.

3. మున్సిపల్ శాఖ (Municipal Administration and Urban Development):

ఆస్తిపన్ను చెల్లింపు, జనన & మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు.

4. విద్యుత్ శాఖ (Electric Department):

విద్యుత్ బిల్లుల చెల్లింపు, సేవల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

5. రవాణా శాఖ (APSRTC):

✔ బస్సు టికెట్లు బుకింగ్ , ప్రయాణ సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు.

6. సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF):

✔ CMRF సేవలకు దరఖాస్తు, స్టేటస్ తెలుసుకోవడం.

7. పర్యాటక సమాచారం (Tourism ):

✔ రాష్ట్రంలోని టూరిజం ప్రదేశాల వివరాలు, టికెట్ బుకింగ్ & వసతి సేవలు ముందుగానే పొందవచ్చు.

ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?

స్వచ్ఛంద, వేగవంతమైన సేవలు ప్రజలకు అందించడం.
పౌర సేవల్లో పారదర్శకత & అవినీతిని తగ్గించటం.
సాంకేతికతను వినియోగించి ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం.
సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సమస్య తొలగించడం.

WhatsApp ద్వారా సేవలు ఎలా పొందాలి?

1️⃣ WhatsApp లో 9552300009 నంబర్ సేవ్ చేసుకోవాలి.
2️⃣ "Hi" అని మెసేజ్ పంపాలి.
3️⃣ మీరు కోరిన సేవ ఎంపిక చేసుకోవాలి.
4️⃣ సంబంధిత వివరాలు అందించి, అవసరమైన ఫీడ్‌బ్యాక్ పొందాలి.

భవిష్యత్తులో మరిన్ని సేవలు:

రెండో విడతలో మరిన్ని పౌరసేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య, పింఛన్, విద్యా శాఖలకు సంబంధించి మరిన్ని సేవలు అందించనున్నారు.

ముగింపు(Epilogue)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించి పౌర సేవలను మరింత సమర్థంగా, వేగంగా, పారదర్శకంగా అందించే దిశగా ముందుకెళ్తోంది. ఈ WhatsApp గవర్నెన్స్ మోడల్ దేశంలోనే వినూత్నమైన ప్రయోగం.

మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ సేవల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఏమైనా సందేహం ఉంటే షేర్ చేయండి.



Post a Comment

Comments