You saకోటప్పకొండ ఉత్సవం: 🛕🕉️🎉
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ - కొట్టప్పకొండ ఉత్సవం గురించి పూర్తి వివరాలు
కొట్టప్పకొండ ఉత్సవం:
ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో భారీ ఆధ్యాత్మిక, సాంసృతిక వైభవంతో జరిగే కొట్టప్పకొండ ఉత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. శివరాత్రి పర్వదినం గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర కొట్టప్పకొండ త్రికూతపర్వతం వద్ద భక్తుల సందడి, ఆధ్యాత్మిక ఉపదేశాలతో కళకళలాడుతుంది.
కొట్టప్పకొండ చరిత్ర:
కొట్టప్పకొండ, త్రికూటపర్వతంగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం, ఇక్కడ పర్వతం మూడు కొండల మధ్య ఉండటంతో త్రికూట పర్వతంగా పేరు వచ్చింది. ఇక్కడ మూడు శిఖరాలు ఉంటాయి, వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా భావిస్తారు. ఇక్కడి ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఋషులు, మహర్షులు తపస్సు చేయడం వలన ఈ పుణ్యక్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యం ఏర్పడినది. ఈ ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే అభివృద్ధి చెందినది అని వెలనాటి చోళ రాజు అయిన కులోత్తుంగ చోళుడు , సమంతుడు అయిన మురింగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టప్ప కొండ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్టప్పకొండ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. ఈ ఉత్సవం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకముగా బస్సు సర్వీసులు, స్వచ్ఛమైన నీరు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఉత్సవం సందర్బంగా ట్రాఫిక్ నియంత్రణ, వైద్యసాదుపాయ ఏర్పాట్లు విసృతంగా చేశారు.
ఎలా చేరుకోవాలి ?
నరసరావుపేటకు రైల్వే, బస్సు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అక్కడ నుండి ప్రత్యేక బస్సులు, ఆటోల ద్వారా కొండ వరకు చేరుకోవచ్చు.
విజయవాడ నుండి కొట్టపకొండ వరకు ఎలా చేరుకోవాలి?
విజయవాడ నుండి కోట్టప్పకొండకు సుమారు 80 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు మీద సులభంగా చేరుకోవచ్చు. RTC బస్సులు , ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
శివరాత్రి వేళ: ఆధ్యాత్మికతలో నిమగ్నం 🛕
కోట్టప్పకొండ ఉత్సవం యొక్క ప్రత్యేకతలు :
మహాశివరాత్రి సందర్భంగా జరిగే కొట్టపకొండ ఉత్సవం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో కోడెల మల్లన స్వామి వాహన సేవ, రధోత్సవం,పల్లకి సేవ,భజనలు, హోమాలు, వ్రతాలు, సాంసృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.
భక్తుల విశ్వాసం , ఆచారాలు
ఉత్సవ సమయంలో భక్తులు కొండను పాదయాత్రగా చేరుకోవడం , శివుడికి ప్రత్యేక పూజలు చేయడం. కొందరు భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు తలనీలాలు స్వామి వారికీ సమర్పిస్తారు .
For more devotional content stay updated to Sasinews.com
Comments