🔔MLC ELECTIONS 2025 - తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు
ఎన్నికల వివరాలు :
ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో శాసనమండలి (MLC ) స్థానాలకి ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు మర్చి 20, 2025న జరగనున్నాయి. ఇంతకు ముందు ఉన్న MLA ఎన్నుకున్న వారి పదవీకాలం మర్చి 29,2025తో ముగియనున్నది.
ఆంధ్రప్రదేశ్ నుండి పదవీకాలం అయిపోతున్న MLCలు:
- కృష్ణమూర్తి జంగ (15. 05. 2024 నుండి ఖాళీగా ఉంది )
- దువ్వారపు రామారావు
- పర్చూరి అశోక్ బాబు
- బి. తిరుమల నాయుడు
- రామకృష్ణుడు యనమల
తెలంగాణ నుండి పదవీకాలం అయిపోతున్న MLCలు:
- Mohd. మోహముద్ అలీ
- సత్యవతి రాథోడ్ సేరి సుభాష్ రెడ్డి
- మల్లేశం యొగ్గె
- మిర్జా రియాజుల హాసన్ ఎఫేండీ
ఎన్నికల షెడ్యూల్ (ELECTION SCHEDULE ):
- నోటిఫికేషన్ విడుదల : మార్చి 3, 2025
- నామినేషన్ వేయుటకు చివరి తేదీ : మార్చి 10, 2025
- నామినేషన్స్ పరిశీలన : మార్చి11, 2025
- నామినేషన్లు ఉపసంహరించుటకు చివరితేది : మార్చి 13,2025
- పోలింగ్ తేదీ (POLLING DATE ) : మార్చి 20, 2025( ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు .
- ఓట్లు లెక్కింపు : మార్చి 20, 2025 సాయంత్రం 5:00 గంటలనుండి
- ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే తేదీ : మార్చి 24, 2025
ఓటు వేయడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ( Important Instructions to Vote in MLC / Teachers Elections) :
- MLC ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు(EVM 'S ) ఉండవు. బ్యాలెట్ పేపర్ (Ballot Paper ) ద్వారా మాత్రమే ఓటు వేయాలి. బాలట్ పేపర్ పై అభ్యర్థి పేరు, ఫోటో ఉంటుంది .
- మీకు నచ్చిన అభ్యర్థి ఎదురుగా "1" నెంబర్ వేయాలి
- మీరు మిగిలిన అభ్యర్థులకు కూడా ఓటు వేయాలి అనుకుంటే ప్రాధాన్యత క్రమంలో రెండు , మూడు స్థానాలలో 2,3 ..... నెంబర్లు పెట్టవచ్చు .
- ఒక్కరికే ఓటు వేయాల్సిన అవసరం లేదు . మీకు ఎంతమందికైనా ఓటు వేయవచ్చు . కానీ ఏ ఇద్దరికీ ఒకే నెంబర్ వేయకూడదు .
- కేవలం 1,2,3,4.... లాంటి అరబిక్ సంక్యలనే వాడాలి . రోమన్ నెంబర్లు వాడకూడదు .
- నెంబర్ల బదులు సున్నాలు గీయడం , టిక్ మార్క్ (✔ ) వేయడం చేయకూడదు .
- ఓటు వేయడానికి వెళ్లే ముందు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలి .
Comments