ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ గురించి పూర్తి వివరాలు
బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన ఛావా సినిమా ఇప్పుడు తెలుగులో కూడా గీత ఆర్ట్స్ బ్యానర్లో మార్చి 7 న తెలుగు ప్రేక్షకుల ముందుకుకి వస్తుంది.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్
శంభాజీ మహారాజ్ : ఒక గొప్ప వీరుడి పుట్టుక
మొగల్ సామ్రాజ్యంతో శంభాజీ పోరాటం
కాబందీ సంఘటన : శంభాజీ మహారాజ్ ని మొగల్ సైన్యం పట్టుకున్న రోజు
1689లో , శంభాజీ మహారాజ్ తన అత్యంత నమ్మకస్తుడు అయిన కాకా మహిత్రే వల్లన మోసపోయాడు. మొఘల్ సైన్యం శంభజీ మహారాజుని బందీగా చేసుకున్నారు.
శంభాజీ మహారాజ్ పై ఔరంగజేబు కక్ష సాధింపు :
శంభాజీ మహారాజ్ ను మొఘల్ సైన్యం బంధించిన తరువాత ఔరంగజేబు దగ్గరకి తీసుకువెళ్లారు . అతను శంభాజీ ని చిత్రహింహాసాలకి గురి చేసారు . శంభాజీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అతని కళ్ల ముందే అతని ప్రాణస్నేహితులని భయంకరంగా చంపారు .
శంభాజీ మహారాజ్ నాలుకను కూడా చీల్చారు , కళ్ళను పొడవడం వంటి అమానుష పద్దతులలో హింసించారు . అతను బతికి ఉండగానే చర్మాన్ని కూడా తీశారు . రాక్షసుల మాదిరిగా అతని కాళ్ళు , చేతులు నరికారు .
మరాఠా వీరుడి మరణం :
ఔరంగజేబు చేసిన నరకయాతనాలకి కూడా శంభాజీ మహారాజ్ తన ధైర్యాన్ని కోల్పోలేదు . మరణం చివరి క్షణం వరకు "హర హర మహాదేవ్ " అని జపిస్తున్నాడు అని చరిత్ర చెబుతుంది . అతని మరణం మరాఠా ప్రజల గుండెల్లో అగ్గిని రగిలించింది . శంభాజీ మహారాజ్ మరణంతో మొగల్ సైన్యం మరాఠాలు కట్టిడిని ప్రయత్నించినా , అతని వీర మరణం మరాఠా గడ్డపై ఆత్మగౌరవాన్ని , పోరాట స్ఫూర్తిని నింపింది .
శంభాజీ మహారాజ్ జీవిత కధ ఎంతో ఘోరమైన , దారుణమైన సంఘటనలకు నిదర్శనం . కానీ అతని దైర్యం , మరాఠా సామ్రాజ్యం కోసం అతను చూపిన పోరాట పటిమ , అతను చేసిన త్యాగం ఈనాటికి భారతదేశ చరిత్ర లో చిరస్థాయిగా మిగిలి ఉంటుంది .
Comments