మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఐదు ముఖ్యమైన ఆహారపధార్ధలు ఇవే ..!
మన శరీర
ఆరోగ్యాన్ని మన మానసిక స్థితి ప్రభావితం చేస్తుంది అనే మాట ఎంత నిజమో , మన మెదడు మన
మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి తీసుకునే ఆహార పదార్ధాలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి
ఉంటాయి . మన రోజువారీ తీసుకునే బోజనంలో కొన్ని ఆహార పదార్ధాలను కలిపి తీసుకోవడం ద్వారా
మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఆహారాలు మెదడుకి అవసరమైన పోషకాలు
అందించడమే కాకుండా , ఒత్తిడి తగ్గించి , ఆనందాన్ని పెంచే హార్మోన్లు (happy Hormones ) ఉత్పత్తి
చేస్తాయి .
🧠మానసిక ఆరోగ్యానికి(Mental
Health ) అవసరమైన ముఖ్యమైన పోషకాలు :
·
ఒమేగా
-3 ఫ్యాటి అసిడ్స్ (Omega-3 Fatty Acids)
·
విటమిన్ B12, విటమిన్ B6
·
మెగ్నీషియం(Mg.)
·
ట్రిప్టోఫాన్
·
ఆంటీ
ఆక్సిడెంట్స్ ( Anti Oxidants)
ఈ పోషకాలు ఉన్న కొన్ని ముక్యమైన ఆహారపదార్ధాల గురించి తెలుసుకుందాం :
1. అరటిపండు (BANANA) 🍌:
అరటిపండులో
ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ గా మారుతుంది.
దీనినే హ్యాపీనెస్ హార్మోన్ గా పిలుస్తారు . అలాగే అరటిపండులో పొటాషియం(k ),
విటమిన్ B6 అధికంగా ఉండటం వల్లన మన మెదడులో న్యూరోట్రాన్స్మీటర్స్(Neurotransmitters) ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఇందు వల్ల మన మానసిక పరిస్థితి
మెరుగుపడుతుంది . ప్రతిరోజు ఉదయం ఒక అరటిపండు తినడం వల్లన మనం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి
సహాయపడుతుంది.
2. బాదం
పప్పు , వాల్ నట్స్ (Dry Fruits ):
వాల్ నట్స్ మరియు ఇతర డ్రైfruits(Almonds,
chia seeds, walnuts) నందు ఒమేగా -3 ఫ్యాటి
అసిడ్స్ (Omega-3 Fatty Acids) అధికంగా ఉంటాయి . ఇవి మెదడుకి ఎక్కువ శక్తిని ఇస్తాయి , మెమరీ పవర్ పెరగడానికి
ఉపయోగపడుతాయి . బాదంలో మెగ్నీషియం(Mg.), విటమిన్ E వంటి
పోషకాలు అధికంగా ఉండటం వల్లన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు 4-5 వాల్ నట్స్ ,
బాదం తినడంవల్లన మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది .
3.
Fatty
Fish 🐠:
Salmon
,మాకెరల్ (Mackerel), టునా(Tuna
) వంటి చేపల్లో ఒమేగా
-3 ఫ్యాటి అసిడ్స్ (Omega-3 Fatty Acids) అధికంగా
ఉంటాయి. ఇవి డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతాయి . ఇవి వారానికి రెండు సార్లు తినడం
వల్లన మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది .
4.
ఆకుకూరలు
మరియు గ్రీన్ వెజిటబుల్స్🥬 (Leafy
and green vegetables)
పాలకూర
, బచాలికూర , మెంతుకుర వంటి ఆకుకూరలలో ఫోలేట్ అనే పోషకాలు ఉంటాయి. ఈ ఫోలేట్ అనే పోషకం
డిప్రెషన్ , అలసటను దూరం చేస్తాయి. ఇవి వారానికి 4-5 సార్లు తీసుకోవడం వల్లన మెదడు
చురుకుగా పనిచేసి , మానసిక ఆరోగ్యము కూడా మెరుగుపడుతుంది .
5.
డార్క్
చాకొలెట్స్ 🍫 (Dark Chocolates):
డార్క్
చాకొలెట్స్ సరైన మోతాదులో తీసుకుంటే మెదడు
చక్కగా పనిచేస్తుంది. ఇది సెరటోనీన్ అనే హ్యాపీ హార్మోన్ ని విడుదల చేసేందుకు సహాయపడుతుంది
. ఇది మన శరీరంలో డిప్రెషన్ , అలసటని తగ్గించి మన శరీరంలో మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది
.
మీ
మెంటల్ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే మొదట మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ప్రారంభించాలి
. అరటిపండు , బాదం , ఆకుకూరలు , ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ , చేపలు , డార్క్ చాకొలెట్ వంటి
ఆహారపదార్ధాలు మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
For more Health news follow us on : sasinews.com
Comments